జాతిరత్నాలు హీరోయిన్ ఇంత టాలెంటా? ఆ కళల్లోనూ ప్రావీణ్యం పొందిన ఫరియా అబ్దుల్లా..

Published : Jun 21, 2022, 04:58 PM IST

‘జాతిరత్నాలు’తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయింది ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). తన నటన, గ్లామర్ తో యూత్ అటెన్షన్ డ్రా చేసింది. ఈ రోజు చిట్టి బర్త్ డే.. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.   

PREV
16
జాతిరత్నాలు హీరోయిన్ ఇంత టాలెంటా? ఆ కళల్లోనూ ప్రావీణ్యం పొందిన ఫరియా అబ్దుల్లా..

తొలి చిత్రంతోనే తన ప్రతిభ చూపించిన హీరోయిన్ ఫిరియా అబ్దుల్లా (Faria Abdullah). జాతిరత్నాలులో చిట్టి పాత్రలో తెలుగు ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత టాలీవుడ్ లో ఫిరియా పేరు హాట్ టాపిక్ గా మారింది. దర్శక నిర్మాత చూపు ఈ యంగ్ బ్యూటీపైనే ఉంది.
 

26

జాతిరత్నాలు (Jathiratnalu)తో మంచి హిట్ అందుకున్న ఫరియా.. ఆ తర్వాత బంగార్రాజు చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోందీ బ్యూటీ. 

36

వరుస సినిమాలతో  జోరు పెంచిన ఈ హీరోయిన్ ప్రస్తుతం విజయ్ ఆంటోనీ నటిస్తున్న ‘వాలీ మయిల్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే  ‘రావణాసుర’లోనూ రవితేజతో కలిసి నటించనుంది. అలాగే యంగ్ హీరో సంతోష్ శోభన్(Santhosh shobhan) తో ఓ సినిమా చేస్తుంది. మేర్లపాక గాంధీ ఈసినిమాను తెరకెక్కించబోతున్నట్టు టాక్. 
 

46

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఫరియా అబ్దుల్లా పుట్టిన  రోజు కావడం విశేషం. తన పుట్టిన రోజును కుటుంబ సభ్యులతోనే సెలబ్రేట్ చేసుకుందీ బ్యూటీ. ఈ సందర్భంగా ఫరియాలోని మరిన్ని టాలెంట్స్ ను తెలుసుకుందాం. ఫరియా ఇప్పటికే తన డ్యాన్స్ తో సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకుంది.
 

56

డాన్స్, యాక్టింగ్ లోనే కాకుండా..  చిన్నప్పటి నుంచే పెయింటింగ్ లోనూ ప్రావీణ్యం కలిగి ఉంది చిట్టి. హైదరాబాద్ లోని కాచిగూడలో పెయింటింగ్ నేర్చుకుంది. తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్న ఈ బ్యూటీ.. ‘నిషుంబిత’, ‘సమహార’ థియేటర్ ఆర్ట్స్ గ్రూప్స్ తోనూ కలిసి పనిచేందని సమాచారం. 

66

ఆ సమయంలో ఫరియా నాటకాలకు దర్శకత్వం వహించిందంట. అలాగే రచనలు కూడా చేసిందని తెలుస్తోంది. ఇక తన కాలేజ్ లోనే పలు నాటకాలు, చిన్న చిన్న స్కిట్స్ తో అందరిని ఆకట్టుకుందంట. ముఖ్యంగా కాలేజీలో జరిగే ఈవెంట్స్ లో చిట్టి డాన్స్ కు స్టేజీ దద్దరిల్లిపోయేదంట. అలా నాగ్ అశ్విన్ కంట్లో పడి జాతిరత్నాలు హీరోయిన్ గా ఎంపికైంది.

click me!

Recommended Stories