స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ, కారణం ఏంటంటే..?

Published : Aug 08, 2023, 06:16 PM IST

గతాన్ని తలుచుకుని వెక్కివెక్కి ఏడ్చారు ప్రముఖ సినీనటి.. మాజీ హీరోయిన్ ఇంద్రజ. ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా గడిపేస్తున్న ఆమె.. తాజాగా ఓ స్టేజ్ పై చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
16
స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్రజ, కారణం ఏంటంటే..?

90స్ లో స్టార్స్ గా వెలుగు వెలిగిన హీరోయిన్లు అంతా.. ఏదో ఒక రూపంలో రీ ఎంట్రీలు ఇస్తున్నారు.. కొంత మంది వెడితెరపూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా ఉంటే..మరికొందరేమో.. బుల్లితెరను ఏలుతున్నారు.. ఇంకొందరేమో.. రెండింటిపై గట్టిగా గ్రిప్ సాధించి అంతటా వాళ్లే కనిపిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో ఇంద్రజ కూడా ఒకరు.  హీరోయిన్ గా వెయిడ్ అవుటు అయిన ఈ తార.. ప్రస్తుతం వెండితెరపైనే కాకుండా..బుల్లితెరపై కూడా ఒక ఊపు ఊపేస్తోంది. 

26

రోజా, జీవిత, రాధిక, సుమలత, సంగీత, రంభ ఇలా చాలా మంది బుల్లితెరపై తమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వీరిలో చాలా వరకు సూపర్ స్టార్డమ్ దక్కించుకున్నారు కూడా. అయితే.. లేట్ గా ఈ లిస్ట్ లో చేరిన సీనియర్ హీరోయిన్ ఇంద్రజ. ఆమధ్యే జబర్థస్త్ లోకి జడ్జిగా ఎంట్రీ ఇచ్చింది ఇంద్రజ.  అక్కడ నుండి ఆమె తిరిగి చూసుకోలేదు. 

36

జబర్థస్త్ తో పాటు.. ఎక్స్ ట్రా జబర్థస్త్.. శ్రీదేవి డ్రామా కంపెనీ.. పండగ ప్రోగ్రామ్స్ తో.. కళకళలాడిపోతోంది. చేతినిండ సంపాదనతో పాటు.. బుల్లితెర ప్రేక్షుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది ఇంద్రజ.  లేదు. ఇప్పుడు అన్ని షోలలో ఇంద్రజ కనిపిస్తూనే ఉంది. ఒకప్పుడు హీరోయిన్ గా ఆమె ఎంతటి క్రేజ్ దక్కించుకుందో, ఇప్పుడు అంతకుమించిన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చి పడింది.
 

46

ఇక అటు వెండితెరపై కూడా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ.. ఇటు టెలివిజన్ లో సెలబ్రిటీగావెలుగు వెలుగుతోంది ఇంద్రజ. ఈక్రమంలో ఆమె షోలో కన్నీరూ పెట్టుకుని.. ఏడ్చిన సంఘటన వైరల్ అవుతోంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాబోయే.. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రోమో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ పంచ్ లు ప్రవాహంలా వచ్చిపడినా.. అన్నింటిలో.. హైలెట్ అయ్యింది మాత్రం ఇంద్రజ క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. 
 

56

అయితే.., అద్భుతమైన డ్యాన్స్ తర్వాత ఇంద్రజ బాగా ఎమోషనల్ అయిపోయింది. తనకి అందిన ప్రశంసలు చూసి ఇంద్రజ ఆనందాన్ని తట్టుకోలేక ఏడ్చేసింది. తనని మళ్ళీ ఒక డ్యాన్సర్ గా చూసుకుని ఆమె ఆనందభాష్పాలు కార్చేసింది. ఇన్నాళ్లు ఇది నేను మిస్ అయిపోయానా అంటూ.. గుక్క పెట్టి ఏడ్చేసింది. ఒక కళాకారిణికి ఈ రకమైన భావోద్వేగం ఉండటం సహజం. ఇంద్రజ ఎమోషనల్ అయిన తీరుతో అక్కడ ఉన్నవారంతా ఎమోషనల్ అయ్యారు. 
 

66

ఇంద్రజ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇలా ఇంద్రజ బుల్లితెరపై బిజీ  అవ్వడంతో పాటు.. ఇలా తనకు పెర్ఫార్మ్ చేసే అవకాశం రావడంతో.. ఆమె అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. 

click me!

Recommended Stories