బర్త్ డే పార్టీలో సురేఖవాణి కూతురు రచ్చ.. పబ్‌లో పొట్టిదుస్తుల్లో రెచ్చిపోయిన సుప్రిత.. బాబోయ్‌ ఇదేం తెగింపు

Published : Aug 08, 2023, 05:25 PM ISTUpdated : Aug 08, 2023, 08:24 PM IST

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ సురేఖ వాణి.. నటిగా సినిమాలు తగ్గించింది. కానీ కూతురు సుప్రితతో కలిసి బాగా ఎంజాయ్‌ చేస్తుంది. తాజాగా సుప్రిత బర్త్ డే పార్టీలోనూ రచ్చ చేశారు.  

PREV
19
బర్త్ డే పార్టీలో సురేఖవాణి కూతురు రచ్చ.. పబ్‌లో పొట్టిదుస్తుల్లో రెచ్చిపోయిన సుప్రిత.. బాబోయ్‌ ఇదేం తెగింపు

సురేఖవాణి.. కూతురు సుప్రిత బర్త్‌ డే సోమవారం. ఈ సందర్భంగా సుప్రిత తనపుట్టిన రోజుని పబ్‌లో చేసుకుంది. తన ఫ్రెండ్స్, సన్నిహితుల మధ్య తన బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంది. ఇందులో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, హద్దులు చెరిపేసి రెచ్చిపోయిందని చెప్పొచ్చు. 

29

ఇక వరుసగా ఫ్రెండ్స్ తెచ్చిన కేక్స్ కటింగ్స్ తోపాటు వారితో డ్రింగ్స్ తీసుకుంటూ రచ్చ చేసింది. డాన్సులతో అదరగొట్టింది. హగ్గులు, కిస్సులతో తెగ రెచ్చిపోయిందీ సుప్రిత. ఇక తనకు అడ్డే లేదనేలా, తనలైఫ్‌లో ఇంతకి మించిన రోజు లేదనేలా ఆమె తన బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. 
 

39

ప్రస్తుతం ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకుంది. అభిమానులతో షేర్‌ చేసింది. ఇందులో పింక్‌ డ్రెస్‌ వేసుకుంది సుప్రిత. జబ్బల కిందకి ఉన్న స్లీవ్‌ లెస్‌ గౌనులో రెచ్చిపోయింది. ఫ్రెండ్స్ తో కలిసి డాన్సులు చేస్తూ పిచ్చెక్కించింది. మొత్తంగా పబ్‌లో తన బర్త్ డేని తెగ ఎంజాయ్‌ చేసింది సుప్రిత.
 

49

ఇదిలా ఉంటే సుప్రిత బర్త్ డే సందర్భంగా కూతురు సుప్రితకి బెస్ట్ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది సురేఖవాణి. న్యూ జెర్సీలోని వీధుల్లో ఓ బిల్డింగ్‌పై తండ్రితో ఉన్న సుప్రిత ఫోటోని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. ఆ ఫోటోని చూసిన సుప్రిత ఎమోషనల్‌ అయ్యారు. ఆనందం తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంది. దీన్ని సురేఖవాణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

59

సురేఖవాణి, సుప్రిత ఏం చేసినా కలిసే చేస్తుంటారు. వెకేషన్‌కి వెళ్లినా, పార్టీలకు వెళ్లినా, పబ్‌లకు వెళ్లినా కలిసే వెళ్తుంటారు. ఇలా ఇద్దరు కలిసే అన్ని చేస్తున్నారని చెప్పొచ్చు. తన భర్త చనిపోయిన తర్వాత కూతురుతోనే చిల్‌ అవుతుంది సురేఖవాణి. ఈక్రమంలో తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది.

69

అయితే వాళ్లు ధరించే దుస్తులు ట్రోల్స్ కి గురవుతున్నాయి. ఇద్దరు పొట్టి దుస్తులు ధరించి రెచ్చిపోతుండటంతో దాన్ని కొందరు ట్రోల్‌ చేస్తున్నారు. కూతురులాగానే సురేఖవాణి చిన్నవైన దుస్తులు ధరించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. కొన్నిసార్లు వాటికి కౌంటర్లిస్తున్న ఈ సీనియర్‌ భామ.. చాలా వరకు వాటిని లెక్కచేయకుండా తమకు నచ్చింది చేస్తున్నారు.
 

79

ఇదిలా ఉంటే సురేఖవాణి ఒకప్పుడు నటిగా బిజీగా గడిపింది. కానీ ఇటీవల ఆమె సినిమాలు తగ్గాయి. చాలారేర్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు చాలా కాలం తర్వాత `భోళా శంకర్‌`లో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
 

89

ఇక సుప్రిత కూడా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుంది. నటిగా రాణించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.  నటనలో శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. 

99

సోషల్‌ మీడియాలో మాత్రం ఈ భామ ఫుల్ బిజీగా ఉంటుంది. పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ రచ్చ చేస్తుంది. గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. హాట్‌ బాంబ్‌లో రచ్చ చేస్తుందీ హాట్‌ బ్యూటీ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories