ఏదేమైనా చిత్రం నుంచి త్వరలో ఎన్టీఆర్ కు సంబంధించిన మాసీవ్ అండ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ విడుదల కాబోతుందనడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ చిత్రంతో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) విలన్ గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.