ప్రముఖ నటుడి కుటుంబంపై చేతబడి.. నీళ్లు తాగితే వాంతులు, నరకం..

pratap reddy   | Asianet News
Published : Aug 20, 2021, 04:49 PM IST

సినీ నటులు హర్రర్ చిత్రాల్లో నటిస్తుంటారు. అలాంటి నటులకు నిజ జీవితంలో చేతబడి లాంటి సంఘటన ఎదురైతే ఎలా ఉంటుంది.. నరకం కనిపిస్తుంది అని ప్రముఖ నటుడు టార్జాన్ లక్ష్మీ నారాయణ అంటున్నాడు. 

PREV
17
ప్రముఖ నటుడి కుటుంబంపై చేతబడి.. నీళ్లు తాగితే వాంతులు, నరకం..

దెయ్యాలు, భూతాలపై ప్రజల్లో ఇప్పటికీ చాలా అపోహలే ఉన్నాయి. వీటిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఈ బిజీ లైఫ్ లో దెయ్యాలు, భూతాలు అంటూ ఆలోచించే వారు తక్కువ. కానీ ఇప్పటికీ కొన్ని మారుమూల ప్రాంతాల్లో దెయ్యాలు, చేతబడులు గురించి ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. 

27

సినీ నటులు హర్రర్ చిత్రాల్లో నటిస్తుంటారు. అలాంటి నటులకు నిజ జీవితంలో చేతబడి లాంటి సంఘటన ఎదురైతే ఎలా ఉంటుంది.. నరకం కనిపిస్తుంది అని ప్రముఖ నటుడు టార్జాన్ లక్ష్మీ నారాయణ అంటున్నాడు. 

37

టార్జాన్ లక్ష్మీ నారాయణ టాలీవుడ్ లో విలన్ వేషాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పటికీ లక్ష్మీ నారాయణకు విలన్ గా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా గతంలో తన కుటుంబానికి ఎదురైన భయంకర సంఘటన గురించి లక్ష్మీ నారాయణ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. 

47

భగవంతుడి దయతో సినిమాల్లో నాకు ప్రేక్షక ఆదరణ లభించింది. 30 ఏళ్లుగా సినిమాల్లో కొనసాగుతున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు రూ 2వేలు మాత్రమే ఇచ్చేవారు. మా కుటుంబానికి అవి సరిపోయేవి కాదు. అందుకే మధ్యలో బిజినెస్ మొదలు పెట్టాల్సి వచ్చింది. 

57

ఆ టైంలో మా కుటుంబం తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంది. మేమెంటే పడని మా దగ్గరి బంధువులే నా కుటుంబంపై చేతబడి చేయించారు అని లక్ష్మీనారాయణ సంచలన విషయం బయట పెట్టాడు. ఏపీలోని పరిగి దగ్గర్లో రాపోలు అనే గ్రామం తమ సొంత ఊరు అని లక్ష్మీనారాయణ అన్నారు. 

67

చేతబడి పర్యవసానాలు చాలా దారుణంగా ఉంటాయి. మా అమ్మ, నాన్న, అన్నయ్యతో పాటు నాపై కూడా చేతబడి చేశారు. ఫలితంగా మా కుటుంబం 13 ఏళ్ల పాటు నరకం అనుభవించాల్సి వచ్చింది. నీళ్లు తాగినా వాంతులు అయ్యేవి. విపరీతమైన కడుపునొప్పి. నా తోపాటు మా అన్నయ్య కూడా వాంతులతో బాధపడ్డాడు. 

77

ఇక అక్కడ బ్రతకలేక అన్నీ అమ్ముకుని హైదరాబాద్ కు వచ్చేసినట్లు లక్ష్మీ నారాయణ అన్నారు. చేతబడి అపోహ కాదని దానిని నమ్మాలని లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశాడు. 
 

click me!

Recommended Stories