టైమ్స్ మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్ ‌ వీళ్ళే

First Published | Aug 29, 2020, 7:56 PM IST

టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్ లిస్ట్ పూరీ హీరోయిన్‌ దిశా పటానీ టాప్‌లో నిలిచింది. ఆమె మొదటి స్థానం దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. టాప్‌ టెన్‌లో కత్రినా కైఫ్‌, దీపికా పదుకొనె, కైరా అద్వానీ, శ్రద్ధా కపూర్‌, యామీ గౌతమ్‌, అదితి రావు హైదరీ, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నిలవడం విశేషం. 

గతేడాదిగానూ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్స్-50 లిస్ట్ కోసం దేశ వ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన నలభై ఏళ్ళ లోపు మహిళలపై ఆన్‌లైన్‌ పోలింగ్‌ నిర్వహించింది.ఇందులో సినీ రంగానికి చెందిన వారికే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో టాప్‌-50 లిస్ట్ ఎక్కువ మంది సినీ రంగానికి చెందిన వారే ఉండటం విశేషం. ఇందులో ప్రధానంగాఆకట్టుకునే బాడీ, విశ్వాసం, టాలెంట్‌, తమ రంగంలో గొప్ప స్థానంలోకి ఎదిగిన వారు, సంవత్సర కాలంగా వివిధ కారణాలతో వార్తల్లో నిలిచిన వారు వంటి అంశాలనుపరిగణలోకి తీసుకుని వీరిని ఎంపిక చేశారు.
వీరిలో గతేడాది `భారత్‌`, `బాఘి 3`, `మలంగ్‌` చిత్రాలతో మెప్పించిన దిశా పటానీ మొదటి స్థానంలో నిలిచింది. ఆమె 2018లో తొమ్మిదో స్థానంలో ఉండగా, ఇప్పుడు ఫస్ట్ర్యాంక్‌ని పొందడం విశేషం.

గతేడాది మిస్‌ వరల్డ్ 2019లో రెండో రన్నరప్‌గా నిలచిన సుమన్‌రావు రెండో స్థానాన్ని దక్కించుకుంది.
గతేడాది `భారత్‌` చిత్రంతో సందడి చేసిన హాట్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ మూడో స్థానంలో నిలిచింది.
ప్రియాంక తర్వాత ఆ స్థాయిలో గ్లోబల్ బ్యూటీగా, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న దీపికా పదుకొనె నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
గతేడాది మిస్‌ యూనివర్స్ లో పాల్గొనడంతోపాటు, `చడెయా ఫిటూర్‌`, `కిష్‌మిష్‌` వంటి పాపులర్‌ మ్యూజిక్‌ వీడియోతో ఆకట్టుకున్న వర్తికా సింగ్‌ ఐదో స్థానంలో నిలిచింది.
`కబీర్‌ సింగ్‌`, `గుడ్‌న్యూస్‌` చిత్రాలతో కుర్రకారు గుండెల్లో హీటు పుట్టించి క్రేజీ హీరోయిన్‌గా ఎదిగిన కైరా అద్వానీ ఆరో స్థానాన్ని దక్కించుకుంది.
ఇక `సాహో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడంతోపాటు `చిచ్చోర్‌` వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న శ్రద్ధా కపూర్‌కి ఏడో స్థానం దక్కింది. `చిచ్చోర్‌`లోసుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హీరో కావడం విశేషం.
`ఊరి`, `బాలా` చిత్రాలతో మెప్పించిన యామీ గౌతమ్‌ ఎనిమిదో ర్యాంక్‌ని పొందింది.
ఆ మధ్య టాప్‌ చెన్నై 30లో స్థానం సంపాదించడంతోపాటు తెలుగు, తమిళం, మలయాళం చిత్రాలతో ఆకట్టుకుంటున్న అదితి రావు హైదరీకి తొమ్మిదో స్థానం దక్కింది.
గతేడాది `సాహో` చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసి, ఆ మధ్య ఓ స్పెషల్‌ వీడియో సాంగ్‌లో అదరగొట్టిన జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పదో ర్యాంక్‌ని పొందింది. బాలీవుడ్‌ యంగ్‌హీరోయిన్‌ అలియాకి 12వ స్థానం దక్కగా, తెలుగు హీరోయిన్‌ సమంతకి 17వ స్థానం దక్కింది. వీరితోపాటు టాప్‌-20లో కృతి సనన్‌, కృతి కర్బంద ఉన్నారు.

Latest Videos

click me!