టాలీవుడ్ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్కను ఇష్టపడనివారంటూవుండరు. ఆమె హంబుల్ బిహేవియర్ అంటే చాలా మందికి ఇష్టం. కెరీర్లో అధ్బుతమైన పాత్రలు చేసిన అనుష్కటాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ గా ఏళ్లుగాకొనసాగుతుంది. ఎంతటి స్టార్డం వచ్చినా ఒదిగి ఉండే తత్త్వం, రీజనబుల్ రెమ్యూనరేషన్ తీసుకోవడం అనుష్కకుఉన్న గొప్ప లక్షణాలలోకొన్ని మాత్రమే. ఆచితూచి మాట్లాడే అనుష్క ఇన్నేళ్ళలో ఒక్క వివాదంలో కూడా ఇరుక్కోలేదు.
ఒకప్పుడు సౌత్ ఇండియాకు మాత్రమే పరిచయం ఉన్న అనుష్క బాహుబలి చిత్రం తరువాత ఇండియా వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆమె ఇమేజ్ రీత్యా ఇప్పుడు అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. అందుకే బాహుబలి చిత్రం తరువాత ఆమె కమర్షియల్ చిత్రాలు ఒప్పుకోవడం లేదు.
ఆమెకున్నడిమాండ్ రీత్యా కోట్లు కుమ్మరించేనిర్మాతలు ఉన్నా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.బాహుబలి2 విడుదలై మూడేళ్లు దాటిపోతుండగా ఆమె చేసింది భాగమతి అనే ఒకే ఒక పూర్తిస్థాయి చిత్రం. ఆ మూవీ 2018లో రాగా మరోరెండేళ్లకునిశ్శబ్డం మూవీ చేసింది. ఈ చిత్రం థియేటర్స్బంద్ కారణంగా విడుదల వాయిదాపడింది.
కాగా ఇంత ఫాలోయింగ్ ఉన్న అనుష్క సోషల్ మీడియాలోఅసలు యాక్టీవ్ గా ఉండరు. కనీసం నెలకు ఒక పోస్ట్ కూడా పెట్టరు. అరుదుగా పెట్టే ఆ పోస్టులు కూడా బర్త్ డే విషెష్, ముఖ్యమైన ఈవెంట్స్ కి సంబంధించి మాత్రమే ఉంటాయి. అత్యంత ఆదరణ కలిగిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాన్స్ లో ఒకటైన ట్విట్టర్లో ఎందుకోఆమెకు అకౌంట్ లేదు.
ఇదే విషయాన్ని అనుష్కను అడుగగాఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. నాకు సిగ్గు ఎక్కువ, అపరిచితులతో త్వరగా కలవలేను. సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. అలాగే నాకు ఖాళీ సమయం కూడా దొరకడం లేదు. అందుకే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండను. ట్విటర్ లో అకౌంట్ లేకపోవడానికికూడా కారణం అదే అని అనుష్క చెప్పడం విశేషం. ఇక అనుష్కబెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ కి కూడా ట్విటర్ అకౌంట్ లేకపోవడం గమనార్హం.