ఈటీవీకి శుభాకాంక్షలు: పవన్, చిరులపై ఊగిపోతున్న మెగా అభిమానులు

First Published | Aug 29, 2020, 12:38 PM IST

ఈటీవీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు మెగా బ్రదర్స్. ఇది ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. అందుకు కారణం లేకపోలేదు.

వినడానికి ఔనా ఆనేలాగా ఉన్నప్పటికీ... ఇది నిజం. మెగా అభిమానులకు చిరంజీవి, పవన్ కళ్యాణ్లపై కోపం వచ్చింది. దానికి కారణం ఈటీవీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిరువురూ శుభాకాంక్షలు తెలపడమే!
undefined
అందరూ శుభాకాంక్షలు తెలిపారు. అందరితోపాటే పవన్ కళ్యాణ్, చిరంజీవిలు కూడా ఈటీవీకి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక వీడియో బైట్ ను వదిలితే... చిరంజీవి ఏకంగా కేక్ కట్ చేసిమరీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.
undefined

Latest Videos


బుల్లితెరపై ఈటీవీది గొప్ప ప్రస్థానం. టీవీ రంగంలో ఊహించని మార్పులను తీసుకొచ్చి సీరియల్స్ ని మరింతగా ప్రెకషకులకు చేరువచేసింది ఈటీవీ. అలాంటి టీవీ ఛానల్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు మెగా బ్రదర్స్.
undefined
ఇది ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. అందుకు కారణం లేకపోలేదు. 2009 ఎన్నికల తరువాత ఈనాడు దినపత్రికలో "జెండా పీకేద్దామా..?" అనే శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది. ఎన్నికల తరువాత చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారంటూ ఆ కథనం పేర్కొంది.
undefined
చిరంజీవి సైతం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ వార్తలను ఖండించారు. ఈనాడుపై ఒంటికాలితో లేచారు. ఆ ఘటన తరువాత నిజంగానే జరిగినప్పటికీ... మెగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికి ఆ కథనంపై విరుచుకుపడుతూనే ఉంటారు.
undefined
ఇక పవన్ కళ్యాణ్, చిరంజీవి విషెస్ చెప్పడం.... మెగా అభిమానులకు కోపం తెప్పించింది. అప్పట్లో జరిగిన ఆ సంఘటనను అప్పుడే ఎలా మరిచిపోయారంటూ వారు సోషల్ మీడియాలో ఊగిపోయారు.
undefined
రాష్ట్రంలో జెండా పాతాలని బలంగా డిసైడ్ అయిన బీజేపీ వైసీపీ, టీడీపీలలో టీడీపీని టార్గెట్ చేసి ప్రతిపక్షం తామే అని నిరూపించుకోవాలని చూస్తుంది. ఈ ప్లాన్ లో భాగంగా విపరీతంగా టీడీపీని టార్గెట్ చేస్తుంది.
undefined
click me!