సామాజిక మాధ్యమాల్లో స్పందనలు
కమల్ హాసన్ రొమాంటిక్ సీన్స్ పై నెటిజన్ల అభిప్రాయాలు రెండు విధాలుగా ఉన్నాయి. కొందరైతే ఇలా ఎక్కువ వయసు తేడా ఉన్న నటుల మధ్య సన్నిహిత సన్నివేశాలను ప్రోత్సహించకూడదని అభిప్రాయపడగా, మరికొంతమంది ఇది కేవలం సినిమా పాత్రల మధ్య సన్నివేశం మాత్రమేనని అంటున్నారు.
ఓ నెటిజన్, “మనం ట్రైలర్ మొత్తం వదిలేసి ముద్దు సన్నివేశం గురించే చర్చించడం ఏం తగిన విషయం కాదు. ఇది సర్వసాధారణమే,” అన్నారు. మరొకరు స్పందిస్తూ, “తన వయసులో దాదాపు సగం వయసు ఉన్న హీరోయిన్లతో ఇటువంటి సన్నివేశాలు చేయడం సర్వసాధారణం కాదు,” అన్నారు. ఇంకొకరు X (ట్విట్టర్)లో, “2025లో కూడా మణిరత్నం రూపొందించిన ట్రైలర్‌లో కేవలం ముద్దు సన్నివేశం మాత్రమే మీకు కనిపించిందా? ఇంకేమీ లేదా,” అంటూ కామెంట్ చేశారు.