నా ప్రైవేట్ పార్ట్స్ గురించి పచ్చిగా మాట్లాడారు.. లైగర్ హీరోయిన్ అనన్య పాండే ఆవేదన, ఏం జరిగిందంటే

Published : May 18, 2025, 12:34 PM IST

బాలీవుడ్ నటీమణి అనన్య పాండే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రోజుల్లో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారట.

PREV
15
నా ప్రైవేట్ పార్ట్స్ గురించి పచ్చిగా మాట్లాడారు.. లైగర్ హీరోయిన్ అనన్య పాండే ఆవేదన, ఏం జరిగిందంటే
Ananya Panday

బాలీవుడ్ నటీమణి అనన్య పాండే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రోజుల్లో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారట. సినిమా కుటుంబ నేపథ్యం ఉన్న అనన్యపై "నెపో కిడ్‌" అంటూ కామెంట్స్ రావడం సహజమే అయినప్పటికీ, ఆమెపై వచ్చిన బాడీ షేమింగ్ విమర్శలు తీవ్రంగా బాధించాయనీ, తనను వ్యక్తిగతంగా గాయపరిచాయనీ ఆమె పేర్కొన్నారు.

 

25
Ananya Panday

"నేను 18 లేదా 19 ఏళ్ళ వయసులో సినీ రంగంలోకి వచ్చాను. అప్పట్లో చాలా సన్నగా ఉండేదాన్ని. అప్పుడు కొంతమంది నన్ను చూసి 'నీ కాళ్లు చికెన్ లెగ్స్ లా ఉన్నాయి, నువ్వు మాచ్‌స్టిక్ లా ఉన్నావ్‌, ఫ్లాట్ స్క్రీన్ టీవీలా ఉన్నావ్‌ అని కామెంట్స్ చేశారు. మరికొంతమంది అత్యంత దారుణంగా నా ప్రైవేట్ పార్ట్స్ గురించి పచ్చిగా మాట్లాడారుఅని అనన్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ బాడీ షేమింగ్‌పై స్పందిస్తూ, నేను ఇక్కడ విజయం సాధించలేను ఏమో అనే ఫీలింగ్ కలిగింది అని ఆమె వ్యాఖ్యానించారు.

 

35
Ananya Panday

ఆ తర్వాత ఆమె శరీరంగా ఎదిగినా, విమర్శలు మాత్రం తగ్గలేదట. “ఇప్పుడు ఇంకో తరహా కామెంట్లు వస్తున్నాయి. నువ్వు ప్రైవేట్ పార్ట్ కి సర్జరీ చేయించుకున్నావు అంటూ వదంతులు ప్రచారం చేస్తున్నారు అని ఆమె తెలిపారు.

అనన్య పాండే తన సినీ జీవితాన్ని స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే హిందీ చిత్రంతో ప్రారంభించారు. పరిశ్రమలో మహిళలపై ఉండే లైంగిక వివక్షపై మాట్లాడిన ఆమె, "మహిళలపై ఎప్పుడూ ఎవరైనా ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. పురుషుల విషయంలో అలాంటి పరిస్థితి కనిపించదు" అని స్పష్టంగా చెప్పారు.

45
Ananya Panday

ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అనన్య పాండే, "ఖో గయే హమ్ కహాం" అనే చిత్రం ద్వారా విమర్శకుల దృష్టిని ఆకర్షించగలిగారు. ఈ చిత్రం ఆమె నటనా నైపుణ్యాన్ని కొత్తగా పరిచయం చేసింది. తాజాగా ఆమె కేసరి చాప్టర్ 2 చిత్రంలో కనిపించారు, అందులో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి.

 

55
Ananya Panday

అనన్య పాండే తనపై వచ్చిన విమర్శలను ఎదుర్కొంటూ, తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడంలో విజయవంతమయ్యారు. ఈ అంశాలపై ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. తెలుగులో అనన్య లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడిగా నటించింది. 

Read more Photos on
click me!