
సీనియర్ నటి, సహజ నటి జయసుధ ఆ మధ్య పెళ్లి వార్తలతో వార్తల్లో నిలిచింది. 64 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లీ అంటూ వార్తలొచ్చాయి. ఓ వ్యక్తితో ఆమె చనువుగా ఉండటం కూడా బయటకు వచ్చింది. పలు ఈవెంట్లలో ఆమె ఓ వ్యక్తితో కనిపించింది. దీంతో జయసుధ మూడో పెళ్లి చేసుకుంటుందని వార్తలు ఊపందుకున్నాయి. రెండు మూడు ఈవెంట్లలోనూ జయసుధ ఇలానే కనిపించడంతో అంతా ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందని అంతా చర్చించుకున్నారు.
తాజాగా దీనిపై జయసుధ ఓపెన్ అయ్యింది. యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. మళ్లీ పెళ్లి చేసుకున్నారని బయట ప్రచారం జరుగుతుందని దీనిపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్‌గా అడగా, ఈ విషయంపై తాను స్పందించాలనుకోవడం లేదని తేల్చి చెప్పింది. తన గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రాస్తున్నారని, తెలిపింది. ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాస్తున్నారని, దీనికితోడు వాటికి కింద కామెంట్లు పెట్టడం మరీ దారుణంగా ఉంటుందని చెప్పింది. వార్తలు కంటే కింద కామెంట్లే భయాంకరంగా ఉంటున్నాయని, ఇంట్లో సరిగా పెరగని వాళ్లే ఇలాంటి కామెంట్లు చేస్తారని ఆమె మండిపడింది.
మరోవైపు మూడో పెళ్లిపై మాత్రం తాను స్పందించనని, చెప్పినా, చెప్పకపోయినా రాసుకునే వాళ్లు రాసుకుంటారని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ సందర్భంగా మరో విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. బేసిక్‌గా తాను ఇండిపెండెంట్ ఉమెన్ అని, అంత ఈజీగా దేనికి భయపడనని, ఇండిపెండెంట్‌గానే ఉండేందుకు ఇష్టపడతాను అలాంటి లైఫే తనకు ఇష్టమని వెల్లడించింది. తన పెళ్లిపై బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదని వెల్లడించింది.
ఈ సందర్భంగా తన అనారోగ్యంపై వచ్చిన రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. కరోనా సమయంలో తాను చాలా టెన్షన్ పడినట్టు చెప్పింది. ఈ క్రమంలో తాను చాలా వెయిట్ లాస్ అయ్యింది. రెండు మూడు నెలల్లోనే 16 కేజీలు తగ్గిపోయిందట. హెయిర్‌కి కలర్ వేసుకోకుండా తాను మార్నింగ్ లేవగానే ఫోటో దిగానని, ఏదో సరదాగా ఆ ఫోటో దిగినట్టు చెప్పింది. కానీ అందులో వెయిట్ లాస్‌తో ఉండటంతో అంతా ఏదో హెల్త్ సమస్య వచ్చిందని ప్రచారం చేశారు. పైగా సోషల్ మీడియా,యూట్యూబ్‌లలో ఈ ప్రచారం మరింత పెరిగింది. విచిత్రమైన థంబ్ నెయిల్స్ పెట్టి హడావుడి చేశారని, తమ వ్యూస్ కోసం, సంపాదన కోసం తనని వాడుకుంటున్నారని తెలిపింది.
జయసుధ ఇటీవల ఓ వ్యక్తితో కలిసి కనిపిస్తుంది. అతని అమెరికాకి చెందిన వ్యక్తి. పేరు ఫిలిపే రూయర్స్. ఆయన తన బయోపిక్ తెరకెక్కించడానికి ఇండియాకి వచ్చారట. ఆ విషయాన్ని గతంలో ఓ సందర్భంలో చెప్పింది జయసుధ. ఇందులో మాట్లాడుతూ, ఫిలిపే రూయెల్స్ సినీ ఇండస్ట్రీలో నా ప్రాముఖ్యతను తెలుసుకోవటానికి నాతో పాటు ప్రతీ ఈవెంట్‌కు హాజరవుతున్నారు. ఆయన రీసెర్చ్ చేసే సమయంలో ఇంటర్నెట్‌లో నా గురించి తెలుసుకున్నారు. అమెరికా వెళ్లినప్పుడు ఆయన్ని కలిశాను. నా గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవటానికి ఇండియా వచ్చారు. ఈవెంట్స్‌కి నాతో పాటు హాజరవుతున్నారు` అని వెల్లడించింది జయసుధ.
జయసుధ.. 16 ఏళ్ల వయసు నుంచే నటిగా మారింది. ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణవంటి వారితోనూ కలిసి నటించింది. చిరంజీవి వంటి వారితోనూ చేసింది. తొలి తరం హీరోయిన్‌గా నిలిచింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మదర్ రోల్స్ చేస్తుంది. మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది. ఇక జయసుధ మొదట కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 1982లో ఇద్దరు విడిపోయారు. మూడేళ్ల తర్వాత నిర్మాత నితిన్ కపూర్‌ని మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017 వరకు కలిసే ఉన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే మూడో పెళ్లికి సంబంధించిన రూమర్స్ ఊపందుకున్నాయి.