బాలీవుడ్ హీరోయిన్లు ప్రస్తుతం సౌత్ లోనూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ముగ్గురు హీరోయిన్లు ఒకే పాటలో నటించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో తెలుసుకుందాం.
ప్రస్తుతం బాలీవుడ్ లో దుమ్ము లేపుతున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారిలో కృతి సనన్ (Kriti Sanon) ముందు వరుసలో ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొడుతుంది.
26
తెలుగు ప్రేక్షకులను చివరిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas తో కలిసి మైథాలజికల్ ఫిలిం ఆదిపురుష్ adipurush చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తోంది.
36
ఈ క్రమంలో కృతి సనన్ మ్యూజిక్ వీడియో లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా పాప్ సింగర్ అండ్ రాపర్ బాద్షా Badshah తో కలిసి నైనా Naina అనే మ్యూజిక్ వీడియోలో నటించింది. అయితే ఇదే సాంగ్ లో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించడం ఆసక్తికరంగా మారింది.
46
వారెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ నటి, దేవర devara లో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనాకపూర్ Kareena Kapoor, అలాగే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటి టబు Tabu కూడా ఈ సాంగ్ లో నటించింది.
56
ఒక యంగ్ హీరోయిన్, ఇద్దరు సీనియర్ హీరోయిన్లతో సింగర్ బాద్షా మరియు దిల్జిత్ దసాంజ్ కలసి ఈ పాటను రూపొందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో రన్నింగ్ లో ఉంది. మంచి వ్యూస్ ను అందుకుంటూ ట్రెండ్ అవుతుంది.
66
సింగర్ బాద్షా ఎప్పుడైనా ఒక హీరోయిన్ తో మ్యూజిక్ వీడియోలను రూపొందించారు. కానీ ఈసారి మాత్రం ముగ్గురు హీరోయిన్లతో సాంగ్ రూపొందించడం సంగీత ప్రియులకు, అభిమానులకు ఐ ఫీస్ట్ గా మారింది. ప్రస్తుతం ఈ సాంగ్ కు 36 మిలియన్ల న్యూస్ దక్కడం విశేషం.