నోటికొచ్చింది వాగకూడదు, నోరు మూసుకోవాలి.. సమంత ఇలా జనాల్ని పిచోళ్ళని చేస్తోంది, ఏకిపారేసిన డాక్టర్

Published : Mar 14, 2024, 09:28 PM IST

సమంత మయోసైటిస్ నుంచి కోలుకునే క్రమంలో అనేక వైద్య పద్దతులపై అవగాహన పెంచుకుంది. ఈ క్రమంలో సమంత ప్రతి విషయాని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటోంది.

PREV
16
నోటికొచ్చింది వాగకూడదు, నోరు మూసుకోవాలి.. సమంత ఇలా జనాల్ని పిచోళ్ళని చేస్తోంది, ఏకిపారేసిన డాక్టర్

సమంతకి ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత నటనకి అందానికి యువత ఫిదా అయ్యారు. సౌత్ లో క్రేజీ హీరోయిన్లలో సమంత ఒకరు. పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమంత కి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మయోసైటిస్ కారణంగా సమంత సినిమాల జోరు తగ్గించింది. 

26

ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న సామ్ తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది. సమంత మయోసైటిస్ నుంచి కోలుకునే క్రమంలో అనేక వైద్య పద్దతులపై అవగాహన పెంచుకుంది. ఈ క్రమంలో సమంత ప్రతి విషయాని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. అయితే తాజాగా సమంత ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఓ వెల్ నెస్ కోచ్ తో సమంతకి ఈ పాడ్ కాస్ట్ కార్యక్రమం జరిగింది. 

36

వీరిద్దరి మధ్య శరీరంలో కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశం పై చర్చ జరిగింది. ఇంస్టాగ్రామ్ లో 33 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న సమంత వారందరిని తప్పు దోవ పట్టించేలా.. వైద్యం, మెడికల్ విభాగం గురించి ఏమాత్రం అవగాహనా లేకుండా ఇష్టం వచ్చినట్లు వాగుతోంది అంటూ ఓ డాక్టర్ విరుచుకుపడ్డారు. 

46

సమంత మొత్తం అసత్యాలు చెబుతోందని ఓ డాక్టర్ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. లివర్ డీటాక్సింగ్ (కాలేయాన్ని శుద్ధి చేయడం ఎలా ) అనే అంశం పై సమంత చెప్పిన విషయాలన్నీ ప్రజలని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆ డాక్టర్ అన్నారు. ఆమెకి మానవ శరీరం ఎలా పనిచేస్తుందో అవగాహనా లేదు.. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు కొన్ని మూలికల ద్వారా నయం చేసుకోవచ్చు అని ఏదేదో వాగుతోంది. 

56

సెలెబ్రెటీలకు ఫాలోయింగ్ ఉంటే చాలు.. వాళ్ళకి హెల్త్ గురించి, వైద్యం గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా హెల్త్ ఫాడ్ కాస్ట్ లాలో కూర్చోబెట్టేస్తున్నారు. డాండెలైన్ అనే మొక్క లివర్ ఆరోగ్యాన్ని పెంచుతుందని అవాస్తవాలు చెబుతున్నారు. 

66

నేను దశాబ్దం నుంచి రిజిస్టర్ హెపటాలజిస్ట్ గా కాలేయ రోగులకు చికిత్స అందిస్తున్నాను. వీళ్ళు చెప్పిన విషయాల్ని పూర్తిగా ఖండిస్తున్నాను.  డాండెలైన్  అనే మొక్కని పందులు, ఎలుకలు వంటి జంతువులపై ప్రయోగించారు కానీ ఇంతవరకు మానవులపై ప్రయోగించలేదు.  సమంతకి మెడికల్ విభాగం పై అవగాహనా లేకుంటే నోరు మూసుకోవాలి అంటూ విరుచుకుపడ్డారు. సమంత అభిమానులు ఆమె సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. కానీ ఇలాంటి విషయాలని నమ్మకండి అంటూ సదరు డాక్టర్ సుదీర్ఘమైన పోస్ట్ లో చెప్పుకొచ్చారు. 

click me!

Recommended Stories