మినీ స్కర్ట్ లో హాట్ హాట్ స్కిన్ షో.. వైరల్ గా శృతి హాసన్ బోల్డ్ ఫోటో షూట్

First Published | Jul 26, 2021, 2:04 PM IST

మనసులో ఆనందం ముఖంపై కనిపిస్తుందని అంటారు. శృతి హాసన్ ఆనందం మాత్రం ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ లో కనిపిస్తుంది. కొన్ని నెలలుగా శ్రుతి సోషల్ మీడియా పోస్ట్స్ లో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. 
 

నెమ్మదించిన కెరీర్ క్రాక్, వకీల్ సాబ్ వంటి హిట్ చిత్రాలతో ఊపందుకుపోవడంతో పాటు, సలార్ వంటి భారీ చిత్రంలో అవకాశం రావడం కూడా ఓ కారణం. సలార్ మూవీలో ఏకంగా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది శృతి హాసన్.
కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ కూడా మొదలైపోయింది. మొదటి షెడ్యూల్ తెలంగాణా రాష్ట్రంలోని గోదావరి ఖని ఏరియాలో గల మైనింగ్ ప్రాంతంలో నిర్వహించారు. ఇక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు సమాచారం.

శ్రుతి సంతోషానికి మరొక కారణం... కొత్త ప్రియుడు శాంతను హజారిక. ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతనుతో శృతి డేటింగ్ చేస్తున్నారు. సెకండ్ వేవ్ లాక్ డౌన్ కి ముందు మొదలైన ఈ ప్రేమ కహాని రోజు రోజుకు బలంగా మారుతుంది.
ముంబైలో వీరిద్దరూ కలిసి ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. విందులు, వినోదాలు, సంబరాలు జరుపుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. హజారికను శృతి ఎంతో ప్రేమిస్తున్నట్టు స్పష్టంగా ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ లలో అర్థం అవుతుంది.
మొదటి లవర్ మైఖేల్ కోర్స్లే తో బ్రేకప్ తరువాత కొంత డిప్రెషన్ కి గురైన శృతి హాసన్ ని హజారిక పరిచయం సంతోషంగా మార్చింది. శృతి, హజారిక మోస్ట్ లవింగ్ కపుల్ గా తరచూ వార్తలలో నిలుస్తున్నారు.
మరోవైపు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తూ ఫ్యాన్స్ కి చెమటలు పట్టిస్తున్నారు శృతి హాసన్. తాజాగా మినీ స్కర్ట్ లో థైస్ చూపిస్తూ స్కిన్ షోకి తెరలేపింది అమ్మడు.  పొట్టి బట్టలలో ఆమె సెక్సీ పోజులు వైరల్ గా మారాయి.
ప్రముఖ స్పోర్ట్ యాక్సెసరీస్ సంస్థ అడిడాస్ షూస్ ప్రమోషన్స్ లో భాగంగా శృతి చేసిన ఫోటో షూట్ చాలా హాట్ గా ఉంది. ప్రస్తుతం శృతి హాట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.

Latest Videos

click me!