వారాంతం హోస్ట్ నాగార్జున షోని గ్రాండ్ గా నడిపించారు. శని, ఆదివారాలు నాగార్జున ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులకు మంచి సరదా పంచారు. ఐతే గతవారం ఎలిమినేషన్ ద్వారా కరాటే కళ్యాణి ఇంటి నుండి వెళ్లిపోగా, హారిక విషయంలో హైడ్రమా నడిపారు. హారికను ఇంటి డోర్ వరకు తీసుకెళ్లిన సభ్యులు చివరి నిమిషంలో క్యాన్సిల్ అని తెలియడంతో ఆమెను వెనక్కి తీసుకు వచ్చారు.
ఇక నేడు సోమవారం కావడంతో ఎలిమినేషన్ ప్రకియమొదలైంది. ఇంటిలోని సభ్యులువారి అభిప్రాయం మేరకు కారణం చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాల్సింగా బిగ్ బాస్ ఆదేశించారు. కాగా కెప్టెన్ హోదాలో నోయల్ ని ఒకరిని నేరుగా ఎలిమినేషన్ కి నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. దీంతో హౌస్ లో ఉన్న లాస్యను నోయల్ నామినేట్ చేయడం జరిగింది.
ఇంటి సభ్యులలో ఒక్కొక్కరిగా తమకు నచ్చని కారణాలు చెవుతూ ఎలిమినేషన్ కి నామినేట్ చేయడం జరిగింది. వీరిలో అధికంగా ఓట్లు దక్కించుకున్న వారు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.
అత్యధికంగా ఎలిమినేషన్ ఓట్లు పొందిన కుమార్ సాయి, హారిక, ఆరియానా, మెహబూబ్, మోనాల్ ఈవారం ఎలిమినేషన్ కొరకు నామినేట్ కావడం జరిగింది. ఇక కెప్టెన్ గా నోయల్ లాస్యను నామినేట్ చేయగా, ఇంటి నుండి వెళ్ళిపోయిన కళ్యాణి బిగ్ బాంబ్ ద్వారా దేవి నాగవల్లిని నామినేట్ చేయడం జరిగింది.
దీనితో ఈ వారానికి మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. ఎక్కువ మంది సాయి కుమార్ పై కంప్లైంట్ చేయడం విశేషం. ఎలిమినేషన్ ప్రక్రియలో అఖిల్, సోహైల్ కంటెస్టెంట్ కుమార్ సాయితో గొడవపడ్డారు. సుజాత మరియు హారిక మధ్య కూడా వాగ్వాదం నడిచింది. అలాగే సోహైల్, ఆరియానా కూడా ఒకరిని మరొకరు విమర్శించుకున్నారు.