42ఏళ్లుగా ప్రేక్షకుల గుండెల్లో 'చిరంజీవి'గా కొనసాగుతున్నారు..!

First Published | Sep 21, 2020, 9:10 PM IST

మెగాఫ్యాన్స్ భారీ వేడుకకు సిద్ధం అవుతున్నారు.  చిరంజీవి సినీప్రస్థానం మొదలై 42ఏళ్ళు పూర్తి అయ్యింది. దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న చిరంజీవి మొదటి చిత్రం విడుదలై 42ఏళ్ళు పూర్తి చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన చిరు ఎవర్ గ్రీన్ హీరోగా నిలిచిపోయారు.

చిరంజీవి వెండితెరకుపరిచయమైనప్రాణం ఖరీదు మూవీ విడుదలై సరిగ్గా సెప్టెంబర్ 22కి 42ఏళ్ళు . రావు గోపాల్ రావు, చంద్ర మోహన్, జయసుధ, సత్యనారాయణ ముఖ్యపాత్రలోనటించగాచిరంజీవి పల్లెటూరి యువకుడు పాత్ర చేశారు.
ఆ మూవీ తరువాత చిరంజీవి నటుడిగా నిరూపించుకోవడానికి విభిన్న పాత్రలు చేశారు. విలన్, సైడ్ విలన్, సైడ్ హీరో, ముల్టీస్టారర్ లలో నటించారు. 1980 లో విడుదలైన పున్నమి నాగు మూవీ హీరోగా చిరంజీవికి గుర్తింపు తెచ్చింది. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించారు.

1983లో విడుదలైన ఖైదీ చిరంజీవికి భారీ స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఆ చిత్రం చిరంజీవిని స్టార్ ని చేసింది. గుండా, ఛాలెంజ్,కొండవీటి రాజా, రాక్షసుడు వంటి చిత్రాలతో చిరంజీవి తిరుగులేని స్టార్ గా ఎదిగాడు.
90ల నాటికి చిరంజీవి స్టార్ డమ్ పీక్స్ కి చేరింది. కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో చిరంజీవి ఇమేజ్ ఎవరికీ అందనంత ఎత్తుకు చేరింది. అప్పట్లోనే చిరంజీవి కోటి రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
2007లో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన చిరంజీవి పాలిటిక్స్ లో రావడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఎన్నికల బరిలో దిగారు. ఐతే చిరంజీవి వ్యక్తిత్వానికి పాలిటిక్స్ సరిపడకపోవడంతో ఆయన ఉద్వాసన పలికారు.
మధ్యలో కొన్ని చిత్రాలలో క్యామియో అప్పీరెన్స్ ఇచ్చిన చిరు 2017లో ఖైదీ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
గత ఏడాది 250కోట్ల బడ్జెట్ తో సైరా అనే పాన్ ఇండియా మూవీ చేయడం జరిగింది. పలు భాషలలో విడుదలైన ఈ మూవీ టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన చిరంజీవి సినీ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవర్ గ్రీన్ హీరోగా ఆయన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవి గా నిలిచిపోయారు.

Latest Videos

click me!