చాలా మంది రాంచరణ్ నేషనల్ అవార్డుకు అర్హుడు అంటూ బహిరంగంగానే కామెంట్స్ చేశారు. వారిలో ఆశ్చర్యకరంగా మంచు ఫ్యామిలీ హీరో మంచు విష్ణు కూడా ఉన్నారు. ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ.. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇలా లెజెండ్స్ మధ్య విభేదాలు ఉన్నాయని టాలీవుడ్ లో తరచుగా వింటూనే ఉన్నాము. అయితే మెగా, మంచు ఫ్యామిలీ మధ్య విభేదాలని వినడం మాత్రమే కాదు చాలా మంది చూసి ఉంటారు. చిరు మోహన్ బాబు గొడవపడటం ఆ తర్వాత కలిసిపోవడం చూస్తూనే ఉన్నాం.