కోట్లు నీళ్లలా ఖర్చైనా ఆ ఎఫెక్ట్ కోసమే ‘పుష్ప-2’లో VFX, CGI వాడకం

First Published | Oct 19, 2024, 8:02 AM IST


2021లో విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్‌’ (పుష్ప 2). అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది.
 

Allu Arjun, #Pushpa2, sukumar


ఇప్పుడు అందరి దృష్టీ పుష్ప 2 పైనే ఉంది. ఈ సినిమాతో ఎట్టిపరిస్దితుల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన పరిస్దితి సుకుమార్. అయినా ఆ ఒత్తిడిని తన మీద పడనివ్వకుండా సుకుమార్ చాలా జాగ్రత్తగా సినిమా అన్ని అంశాలు అద్బుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ప్రాణంగా నిలిచే విజువల్ ఎఫెక్ట్స్,   VFX క్వాలిటీ మిస్ కాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుతున్న సమాచారం మేరకు  VFX వర్క్ యూరప్ లో జరుగుతోంది.

Allu Arjun, #Pushpa2, sukumar


ఇక విజువల్ ఎఫెక్ట్స్ పుష్ప2  సినిమాకు ప్రాణంగా నిలవనున్నాయి. జపాన్, శ్రీలంక వంటి వైవిధ్యమన లొకేషన్స్ లు, మల్టిఫుల్ జోన్స్, అడవులలో షూట్ చేయటంతో వాటిని ఒకే తాటిపై తెచ్చి...ఒకే చోట చిత్రీకరించినట్లు అనిపించటానికి VFX వాడుతున్నారని తెలుస్తోంది. లైవ్ యాక్షన్ షాట్స్ తో కూడిన విజువల్ ఎఫెక్ట్స్ రియలిస్టిక్ లుక్ తేవటంలో తమ  పాత్రను సమర్దవంతంగా నిర్వహిస్తాయి. 


Allu Arjun, #Pushpa2, sukumar


పుష్ప 2 లో కొన్ని పార్ట్ లు CGI లో క్రియేట్ చేసినప్పటికీ, VFX కే ఎక్కువ ప్రయారిటీ. VFX, CGI కలిసి కొత్త ప్రపంచాన్ని చూసేవారికి అందించబోతున్నాయి. హాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా యూరప్ లో  VFX చేస్తూంటారు. అక్కడ చాలా పెద్ద సినిమాలకు పని చేసిన టీమ్ పుష్ప 2 కు పనిచేస్తోంది. కాబట్టి సుకుమార్ రిలాక్స్ గా,కాన్ఫిడెంట్ గా ఉన్నారు.  ఇప్పటికే ఫస్టాఫ్ ఓకే చేసి లాక్ చేసేసారు. దాదాపు  600 నుంచి  800 షాట్స్ దాకా రీవర్క్ చేసారు. ఎంత ఖర్చు అయినా పెట్టడానికి నిర్మాతలు ఉత్సాహం చూపించటమే అందుకు కారణం. 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా దుమ్ము దులిపింది. బన్ని  కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు..

అంతే కాదు  జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది..ఈ క్రమంలో పుష్ప2 పై ఏ రేంజిలో అంచనాలు ఉంటాయో తెలిసిందే. 

pushpa2


ఈ క్రమంలో  ఇప్పుడు అంతా ‘పుష్ప ది రూల్’ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొదటి పార్టులో పుష్ప ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అని చూపించబోతున్నారని సమాచారం.  ఈ సీక్వెల్ లో జపాన్ ఎపిసోడ్, జాతరలో బన్నీ చీర కట్టు ఫైట్ ఓ రేంజ్​లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది.

ఫహద్ ఫాజిల్ - అల్లు అర్జున్ మధ్య ఫైట్స్​ను మూడో భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు పరిచయం కాని చాలా కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇస్తాయని చెబుతున్నారు. దీని బట్టి పుష్పను టాలీవుడ్​లో ఒక పవర్ ఫుల్ బ్రాండ్​గా మార్చేందుకు సుక్కు సినిమాను గట్టిగానే చెక్కుతున్నారని అర్థమవుతోంది.
 

Latest Videos

click me!