మరీ చెత్త సినిమా కాదు.. అయినా రాంచరణ్ వల్ల దారుణంగా నష్టపోయిన స్టార్ హీరో మూవీ

First Published Jul 25, 2024, 4:34 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత మరిన్ని పాన్ ఇండియా చిత్రాలకు రెడీ అవుతున్నారు. రాంచరణ్ చిరుత చిత్రంతో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత మరిన్ని పాన్ ఇండియా చిత్రాలకు రెడీ అవుతున్నారు. రాంచరణ్ చిరుత చిత్రంతో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు. చిరుత చిత్రంతో సత్తా చాటిన చరణ్.. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంలో నటించి బాక్సాఫీస్ పై తిరుగులేని పంజా విసిరారు. 

మగధీర చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ రేంజ్ లో కలెక్షన్లు తెలుగు సినిమాకి సాధ్యమా అని ఆశ్చర్యపోయేలా మగధీర మూవీ ప్రభంజనం సృష్టించింది. ఇదిలా ఉండగా చాలా మంది తమిళ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నట్లుగానే విక్రమ్ కి కూడా ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. 

Latest Videos


అపరిచితుడు, శివపుత్రుడు లాంటి చిత్రాలతో విక్రమ్ దేశవ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకున్నాడు. నటన అంటే ఎంతటి సాహసం చేసేందుకు అయినా విక్రమ్ వెనుకాడరు. విక్రమ్ ప్రతి చిత్రంలోనూ నటనలో వైవిధ్యం ఉండాలని ఆరాటపడుతుంటారు. 

Magadheera

అపరిచితుడు చిత్రం తర్వాత విక్రమ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగింది. అపరిచితుడు రేంజ్ లో కాకున్నా అవినీతిపై విక్రమ్ చేసిన మరో చిత్రం మల్లన్న. ఈ చిత్రంలో విక్రమ్ సిబిఐ అధికారిగా కనిపించారు. విక్రమ్ విచిత్రమైన పక్షి ఆకారంలో వచ్చి అవినీతి పరుల ఆటకట్టిస్తుంటాడు. విక్రమ్ పెర్ఫామెన్స్ కి ప్రశంసలు దక్కాయి. 

అయితే విక్రమ్ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. రాంచరణ్ మగధీర చిత్రం జూలై 30న 2009లో విడుదలయింది. మగధీర విడుదలైన 20 రోజులకు మల్లన్న చిత్రం విడుదలయింది. అప్పటికి మగధీర ప్రభంజనం ఇంకా తగ్గలేదు. అప్పట్లో ఓటిటి ప్రభావం లేదు కాబట్టి మంచి సినిమా 2 నెలలపాటు థియేటర్స్ లో రాణించేవి. 

మల్లన్న మరీ అంత చెత్త సినిమా కాదు. కానీ మగధీర కారణంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మల్లన్న చిత్రానికి దారుణమైన నష్టాలు ఎదురయ్యాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ అందించారు. నటన పరంగా విక్రమ్ కెరీర్ లో మల్లన్న మరచిపోలేని చిత్రమే. 

click me!