జబర్దస్త్ తో స్టార్స్ అయిన వాళ్లలో హైపర్ ఆది ఒకడు. అదిరే అభి టీమ్ లో ఒక మెంబర్ గా చేరిన హైపర్ ఆది తన టాలెంట్ తో టీమ్ లీడర్ అయ్యాడు. హైపర్ ఆది రైజింగ్ రాజు టీమ్ కి ఆయన లీడర్. శాంతి స్వరూప్, రైజింగ్ రాజుల మీద హైపర్ ఆది వేసే జోక్స్ మామూలుగా పేలవు.
నాన్ స్టాప్ పంచులతో స్కిట్ అయ్యే వరకు హైపర్ ఆది వన్ మ్యాన్ షోతో అదరగొట్టేవాడు. సుడిగాలి సుధీర్ టీమ్ కి పోటీ ఇచ్చిన ఏకైన కమెడియన్ హైపర్ ఆది. అనంతరం ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీల్లో కూడా హైపర్ ఆది అలరించాడు. హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కి దూరమయ్యాడు.
అయితే ఢీ డాన్స్ రియాలిటీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ లో కొనసాగుతున్నాడు. కాగా హైపర్ ఆది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు జోర్దార్ పార్టీ విత్ సునీత అనే టాక్ షోకి వచ్చాడు. జోర్దార్ సుజాత హోస్ట్ చేస్తుండగా... మీకు పొట్టి నరేష్ అంటే ప్రత్యేకమైన అభిమానం అట కదా... అని అడిగింది.
అవునన్న హైపర్ ఆది కారణాలు చెప్పుకొచ్చాడు. అవును నరేష్ అంటే నాకు చాలా ఇష్టం. నరేష్ కి హైట్ ప్రాబ్లమ్ ఉంది. అందుకు కృంగిపోకుండా ఏదో ఒకటి సాధించాలి అనుకున్నాడు. సాధించి చూపాడు. ఈ వయసులో నరేష్ ఒక్కడే కుటుంబం మొత్తాన్ని పోషిస్తున్నాడు. అందుకే నరేష్ అంటే నాకు ప్రేమ అని చెప్పుకొచ్చాడు.
కాగా హైపర్ ఆది వెండితెర మీద కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పాతికకు పైగా చిత్రాల్లో కమెడియన్ గా కనిపించాడు. బుల్లితెర మాదిరి సిల్వర్ స్క్రీన్ పై హైపర్ ఆది కామెడీ పండటం లేదు. అందుకే స్టార్ కాలేకపోయాడు. డైలాగ్ రైటర్ గా కూడా పనిచేస్తున్నాడని సమాచారం.