మళ్ళీ ఆ తప్పు చేయడం అభిజీత్ కి ఇష్టం లేదట... అందుకే ఆలస్యం అయినా!

First Published May 12, 2021, 8:38 AM IST

బిగ్ బాస్ సీజన్ 4 చాలా మంది కొత్తవాళ్లకు కెరీర్ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని సోహైల్ రియాన్, అఖిల్, గంగవ్వ, హారిక, మోనాల్, మెహబూబ్ లాంటి వారు గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షో తర్వాత వారి ఫేమ్ పదిరెట్లు పెరిగింది.

సోహైల్ హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. మెహబూబ్, అఖిల్ కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్నారు. హీరోయిన్ మోనాల్ హీరోయిన్ గానే కాకుండా, బుల్లితెర జడ్జిగా కూడా మారిపోయారు.
undefined
ఈ క్రమంలో టైటిల్ విన్నర్ గా నిలిచిన అభిజీత్ మాత్రం ఒక్క సినిమా ప్రకటించకపోవడం ఆయన ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో తనదైన గేమ్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు అభిజీత్. శరీరం కంటే కూడా బుద్ధిని ఉపయోగించి అతను ప్రేక్షకుల అభిమానం పొందారు.
undefined
ఫైనల్ లో అఖిల్ తో పోటీపడి బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ఎగరేసుకుపోయాడు. బిగ్ బాస్ టైటిల్ దక్కించుకోవడం ద్వారా అభిజీత్ కెరీర్ రేసు గుర్రంలా పరిగెడుతుందని చాలా మంది భావించారు. అయితే అనూహ్యంగా అభిజీత్ కి అనుకున్నంత స్థాయిలో ఆఫర్స్ రాలేదు.
undefined
అఖిల్, సోహైల్ లాంటి వారు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రకటించేయగా, అభిజీత్ మాత్రం ఒక్క ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కించలేదు. దీని వెనుక కారణం ఏమిటో తెలియక ఆయన ఫ్యాన్స్ నిరుస్తాహపడుతున్నారు. అయితే దీని వెనుక ఒక బలమైన కారణం ఉన్నట్లు సినీవర్గాల సమాచారం.
undefined
అభిజీత్ ఈసారి ఓ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. దర్సకుల నుండి అభిజీత్ ఆ తరహా కథ కోరుకుంటున్నారట. అయితే ఆయన ఇమేజ్ దృష్ట్యా లవర్ బాయ్ కథలతో అభిజీత్ ని దర్శకులు సంప్రదిస్తున్నారట.
undefined
గతంలో అభిజీత్ లవర్ బాయ్ రెండు, మూడు సినిమాలు చేశారు. ఆ సినిమాలు ఏవీ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. దీనితో గతంలో చేసిన తప్పు మరలా చేయకూడదని అభిజీత్ ఫిక్స్ అయ్యాడట
undefined
అందుకే రిస్క్ అయినా, ఓ యాక్షన్ మూవీ చేయాలని భావిస్తున్నాడట. ఆ కారణంగా అభిజీత్ మూవీ ఆలస్యం అవుతుందని సమాచారం.
undefined
click me!