యువతిపై 139 మంది రేప్ కేసు: తనపై ఆరోపణల మీద నటుడు కృష్ణుడి క్లారిటీ

గత కొద్దిరోజులుగా ఓ యువతి తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని కేసు పెట్టడం సంచలనంగా మారింది. దాదాపు 9ఏళ్లుగా అనేక మంది తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె కేసుపెట్టారు. ఐతే ఆ 139 మందిలో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు పేర్లు ఉండడం అందరినీ షాక్ కి గురి చేసింది. 

ఏకంగా 139 మంది తనపై లైంగిక దాడి చేశారనిఓ యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టడం సంచలనంగా మారింది. ఆ కేసులో అనేక మంది చిత్ర, రాజకీయ ప్రముఖులపేర్లు ఉండడంతో పాటు యాంకర్ప్రదీప్ మరియు నటుడు కృష్ణుడు పేర్లు ఉండడంఅందరినీ షాక్ గురి చేసింది. ఆమె ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేసిన పేర్లలో ప్రదీప్ మరియు నటుడు కృష్ణుడు పేర్లు కూడా ఉన్నాయి.
ఈ సంఘటన తరువాత యాంకర్ ప్రదీప్ పై నెటిజెన్స్ తీవ్రవ్యాఖ్యలుచేయడం జరిగింది. దీనితో ఆయన ఈ సంఘటనపైపూర్తి వివరణ ఇచ్చారు. ఆ అమ్మాయితో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఇది ఒక కుట్రలో భాగం అన్నారు. దీని వెనుకున్న వారిని పట్టుకుంటానన్న ప్రదీప్, అప్పటి వరకు నిరాధారమైన రాతలు రాయవద్దని అన్నారు.

కాగా ఇదే విషయంపై నటుడు కృష్ణుడు సైతం వివరణ ఇవ్వడం జరిగింది. నాకు సిగరెట్, మందు లాంటి చెడ్డ అలవాట్లు లేవు. పబ్బులకు, పార్టీలకు వెళ్ళను. అలాంటి నాపై ఇలాంటి ఆరోపణలు రావడం ఆశ్చర్యం వేసింది అన్నారు. ఒకరోజు నాకు ఎవరో అమ్మాయి అభిమాని అని కాల్ చేశారు. అంతకు మించి ఆ అమ్మాయి గురించి నాకు తెలియదు. ఈ విషయాన్ని నేను నాభార్యతో కూడా చెప్పాను అన్నారు.
అలాగే 9 ఏళ్లుగా తనపై అత్యాచారం జరుగుతుంటే ఆమె ఎందుకు పోలీసులను ఆశ్రయించలేదు. ఆడవారు ఆపదలో ఉంటే ఆదుకోవడానికి పోలీసులు ఉన్నారు. జస్ట్ 100 కి కాల్ చేసినా సరిపోతుంది. అలాంటిదిఆమె ఇప్పుడు ఇలా అత్యాచార ఆరోపణలుప్రముఖులపై చేయడం వెనుక ఎవరో ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న నన్ను కొందరు వ్యభిచార వృత్తిలో దించారని, హైదరాబాద్ తీసుకువచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ యువతీ ఆరోపిస్తుంది. కులం పేరుతో దూషించడంతో పాటు, తనకు మద్యం తాగించి సామూహికంగామానభంగం చేశారని ఆమె చెవుతున్నారు. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేశారని ఆమె చెప్పడం విశేషం.

Latest Videos

click me!