సింగర్ సునీతకు వర్మ ఆఫర్.. దానికి భయపడి ఒప్పుకోలేదు

First Published Jan 23, 2021, 3:40 PM IST

ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సునీత టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. మాంగో మీడియా అధినేత రామ్ ని సునీత రెండో వివాహం చేసుకోవడం జరిగింది. సునీత నిర్ణయం కొన్ని విమర్శలకు దారి తీసింది.

42ఏళ్ల సునీత రెండో పెళ్లి చేసుకోవడాన్ని కొందరు తప్పుబట్టారు. అయితే ఆయన అభిమానులు సునీతకు మద్దతుగా నిలిచారు. రోజా లాంటి వారు ఆమెను సమర్ధించారు.
undefined
సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వందల సినిమాలకు సునీత పనిచేశారు. కెరీర్ బిగినింగ్ లోనే సునీత సూపర్ పాపులారిటీ సంపాదించారు.
undefined
తీయనైన గొంతుకు తోడు, హీరోయిన్స్ కి సమానమైన గ్లామర్ ఆమె సొంతం. ఇంత క్రేజ్ ఉన్న సునీత హీరోయిన్ గా ఎందుకు మారలేదని చాలా మంది సందేహం.
undefined
ఈ సందేహాలకు సునీత తాజా ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు. మొదట్లో సునీతకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయట. అప్పటి స్టార్ డైరెక్టర్స్ ఆమెను తమ చిత్రాలలో హీరోయిన్ గా చేయాలని అడిగారట.
undefined
కామెడీ అండ్ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి సునీతకు హీరోయిన్ ఆఫర్ ఇచ్చారట. ఓ చిత్రంలో హీరోయిన్ గా చేస్తావా అని అడిగారట.
undefined
అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, అనగనగా ఒకరోజు సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చారట. ఆ ఆఫర్ ని కూడా సునీత సున్నితంగా తిరస్కరించారట.
undefined
దానికి కారణం హీరోయిన్ జీవితాలలో చాలా ఒడిడుకులు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం కష్టం. అందుకే హీరోయిన్ అవ్వాలన్న సాహసం చేయలేదని సునీత చెప్పుకొచ్చారు.
undefined
click me!