ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్ కి వెళితే ఎన్ని లక్షలు ఇస్తారో తెలుసా? 

First Published | Aug 5, 2024, 1:13 PM IST

బిగ్ బాస్ షోకి సెలబ్రిటీలను మాత్రమే ఎంపిక చేస్తారు. అయితే సామాన్యులకు కూడా అవకాశం ఉంటుంది. కాగా ఒక సామాన్యుడు బిగ్ బాస్ షోకి వెళితే ఎంత ఇస్తారో తెలుసా?
 

Bigg boss telugu 8

బిగ్ బాస్ షోకి ఎలా ఎంపిక చేస్తారు? అనే సందేహం చాలా మందిలో ఉంది. అత్యంత ప్రజాదరణ కలిగిన బిగ్ బాస్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందో మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి బయటపెట్టాడు. ఆయన చెప్పిన ప్రకారం సామాన్యులు కూడా ఈ హౌస్లోకి వెళ్లొచ్చు. గణేష్, ఆదిరెడ్డి, పల్లవి ప్రశాంత్, నూతన్ నాయుడు... బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన కామనర్స్ అని చెప్పొచ్చు. 

Bigg boss telugu 8

జనాల్లో పాపులారిటీ ఉన్న సెలెబ్స్ ని సాధారణంగా టీమ్ సంప్రదిస్తారు. సామాన్యులు మాత్రం వాళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎంపిక ప్రక్రియ ఫోన్ కాల్ తో మొదలవుతుంది. మీకు బిగ్ బాస్ షోకి వచ్చే ఆసక్తి ఉందా? అని అడుగుతారు. సదరు వ్యక్తి అంగీకారం తెలిపితే ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం స్టార్ మా నుండి ఒక మెయిల్ వస్తుంది. 

Latest Videos


Bigg Boss Telugu

మూడో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ప్రొడక్షన్ టీమ్, ఛానల్ ప్రతినిధులు పాల్గొంటారట. వీరు పలు విధాల ప్రశ్నలు అడుగుతారట. జాబ్ ఇంటర్వ్యూ మాదిరి టఫ్ క్వచ్చన్స్ ఉండవు. ఒక వ్యక్తి బిగ్ బాస్ హౌస్లో ఉండగలడా? లేదా? భిన్నమైన పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాడు? ఇలాంటి విషయాలను తమ ప్రశ్నల ద్వారా అంచనా వేస్తారట. దాదాపు ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి ఉంటుందట.  ఇంగ్లీష్ రాని వారు తెలుగులో కూడా మాట్లాడొచ్చు. 

గతంలో ఇంటర్వ్యూ ఆన్లైన్ లో చేసేవారట. కోవిడ్ తగ్గాక నేరుగా రెండు మూడు ఇంటర్వ్యూలు చేస్తున్నారట. ఇంటర్వ్యూ అయ్యాక చాలా రోజుల వరకు ఎలాంటి సమాచారం ఉండదు. నెల రోజులకు పైగా సమయం పట్టొచ్చు. ఒక వేళ మనం సెలెక్ట్ అయితే మరలా కాల్ వస్తుంది. అప్పుడు రెమ్యూనరేషన్ బేరసారాలు మొదలవుతాయి. రెమ్యునరేషన్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. 

Bigg boss telugu 8

టాప్ సెలెబ్స్ కి డిమాండ్ చేసే వీలు ఉంటుంది. వారి సంపాదన ఆధారంగా వారు డిమాండ్ చేస్తారు. రెమ్యునరేషన్ మరీ ఎక్కువ అడిగితే ఆ వ్యక్తిని వద్దనుకుంటారు. ఎంతైనా పర్లేదు హౌస్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు డిమాండ్ చేయరు. డిమాండ్ చేయకున్నా బిగ్ బాస్ నిర్వాహకులు మినిమమ్ రెమ్యూనరేషన్ ఎంపికైన ప్రతి కంటెస్టెంట్ కి ఇస్తారు. 

Bigg Boss Telugu 7

అనంతరం డీప్ మెడికల్ చెకప్ ఉంటుంది. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి... ఆ వ్యక్తి ఫిట్ అనుకున్నాక కంటెస్టెంట్ గా ఎంపిక చేస్తారు. ఎలాంటి ఫేమ్ లేని సామాన్యుడు కూడా బిగ్ బాస్ నిర్వాహకులను సంప్రదించి ఆసక్తి ఉందని చెప్పవచ్చు. వారు చేసిన ఇంటర్వ్యూలలో మీరు పాస్ అయితే ఛాన్స్ రావచ్చు. 

Bigg Boss Telugu 7

ప్రతి సీజన్ కి 60 మంది వరకు ఇంటర్వ్యూ చేస్తారట. వారిలో 20 మంది ఎంపిక అవుతారు. కాబట్టి బిగ్ బాస్ షోకి సామాన్యులు వెళ్లడం అసాధ్యమేమీ కాదు. పల్లవి ప్రశాంత్ పలు సీజన్స్ లో ప్రయత్నం చేసి సీజన్ 7కి ఎంపిక అయ్యాడు. ఏకంగా టైటిల్ కొట్టి రికార్డు నెలకొల్పాడు. 

Nagarjuna

ఇక కామనర్ హోదాలో హౌస్లోకి వెళ్లినా కూడా బాగానే ఆర్జించవచ్చు. ఈ విషయాన్ని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి బయటపెట్టాడు. ఆదిరెడ్డి సామాన్యుడిగా బిగ్ బాస్ సీజన్ 6లో పార్టిసిపేట్ చేశాడు. 15 వారాలు హౌస్లో ఉన్న ఆదిరెడ్డి రూ. 25-30 లక్షలు పారితోషికంగా తీసుకున్నాడట. ఇది పెద్ద మొత్తమే అని చెప్పొచ్చు. ఇక సెలెబ్స్ అయితే వారు డిమాండ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. 

click me!