అనుమానాలు పటాపంచలు.. క్లైమాక్స్ గురించి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన పుష్ప 2 టీమ్

First Published | Aug 5, 2024, 1:12 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పుష్ప 2చిత్రం ఆల్రెడీ వాయిదా పడడం ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే విషయం. 

Pushpa 2

అయితే ఫ్యాన్స్ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చిత్ర అవుట్ ఫుట్ పై డైరెక్టర్ సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగష్టు 15న ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ డిసెంబర్ 6కి వాయిదా పడింది. 


ఆ తేదీ కూడా అనుమానమే అంటూ ప్రచారం జోరందుకుంది. డిసెంబర్ లో రిలీజ్ అయ్యేందుకు చాలా చిత్రాలు ఎదురుచూస్తున్నాయి. గేమ్ ఛేంజర్ కూడా డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే పుష్ప 2 డిసెంబర్ లో అయినా వస్తుందా రాదా అనే అనుమానాలు ఉన్నాయి. 

ఎట్టకేలకు పుష్ప 2 చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వడమే కాదు..క్లైమాక్స్ గురించి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. క్లైమాక్స్ కోసం భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ అవుతోందని చెబుతూ అనుమానాలు పటాపంచలు చేశారు. 

Latest Videos

click me!