మొత్తం రెండు రోజుల్లో 9 చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అసలే ఓటిటి కాలంలో జనం థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. బలమైన కంటెంట్ ఉంటే తప్ప టికెట్లు కొనేందుకు సిద్ధపడటం లేదు.
గత కొద్ది కాలంగా భాక్సాఫీస్ బాగా డల్ గా ఉంది. కేజీఎఫ్ 2, ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ లు తర్వాత ఆ స్దాయి సినిమా భాక్సీఫీస్ దగ్గర కపడటం లేదు. గత వారం అదే పరిస్దితి. ఈ వారం కూడా సేమ్ సిట్యువేషన్. వచ్చే వారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో బాక్సాఫీస్ వార్ చిన్న చిత్రాల మధ్య ఉంది. సమ్మతమే తో మొదలెట్టి సదా నన్ను నడిపే సినిమాలు బరిలోకి దూకాయి. మొత్తం రెండు రోజుల్లో 9 చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అసలే ఓటిటి కాలంలో జనం థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. బలమైన కంటెంట్ ఉంటే తప్ప టికెట్లు కొనేందుకు సిద్ధపడటం లేదు.
28
Konda review
అందులో మొదటిది 23న వచ్చిన రామ్ గోపాల్ వర్మ కొండా. వరంగల్ నేత కొండా మురళి బయోపిక్ గా రూపొందిన ఈ మూవీ మీద పెద్ద ఎక్సపెక్టేషన్స్ ఏమీ లేవు కానీ వంగవీటి తరహాలో ఏదైనా మినిమమ్ కంటెంట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది.
38
sammathame movie review,
ఇక తర్వాత 24న రిలీజైన వాటిలో మొదటిది కిరణ్ అబ్బవరం సమ్మతమే. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ లవ్ స్టోరీ మీద యూత్ లో ఓ మాదరి ఇంట్రస్ట్ ఉంది. టీజర్, పాటలు జనాల్లోకి బాగానే వెళ్లాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం సూపర్ హిట్ తర్వాత సెబాస్టియన్ డిజాస్టర్ చూసిన కిరణ్ కు ఈ సక్సెస్ చాలా కీలకంగా మారింది. అయితే ఈ సినిమా కూడా అంతంత మాత్రమే అని తేలిపోయింది.
48
Chor Bazaar
ఇక ఎవరూ ఊహించని విధంగా రేస్ లోకి వచ్చిన ఆకాష్ పూరి చోర్ బజార్ నిన్నటి రోజున థియేటర్లలో అడుగు పెట్టింది. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. డైమండ్ దొంగతనం నేపధ్యంగా తీసుకుని దర్శకుడు జీవన్ రెడ్డి దీన్ని రూపొందించారు. తండ్రి ఎంత పెద్ద డైరెక్టరైనా హీరోగా సక్సెస్ అందుకోలేకపోతున్న ఆకాష్ పూరికి ఇది హిట్ కావడం కీలకం. అయితే ఈ సినిమాకు జనం ఎవరూ కనపడలేదు. సినిమా అంతంత మాత్రమే అని తేలిపోయింది.
58
Gangster gangaraju review
గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే మరో మూవీ కూడా 24నే దిగింది. ప్రమోషన్లు చేసారు కానీ ఇది వస్తున్నట్టు జనానికి పెద్దగా తెలియలేదు. ఈ సినిమాకు కూడా ఓ మాదిరి ఓపినింగ్స్ రాలేదు. దాంతో భాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కూడా అంతంత మాత్రమే అని తేలిపోయింది.
68
7 days 6 Nights Review
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించి దర్శకత్వం వహించిన 7 డేస్ 6 నైట్స్ సైతం పోటీకి దిగింది. ఈ సినిమా కంటెంట్ బాగా డల్ గా ఉందని, సినిమా లో ఏమి చెప్దమని తీసారో క్లారిటీ లేదని అంటున్నారు. సినిమాకు ఓపినింగ్స్ సైతం రాలేదు. ఈ సినిమా వల్ల ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ కు ఏ విధమైన ఫలితం లేకుండా పోయింది.
78
Vikram Box Office - Kamal Haasan's highest grossing film in the first week
ఇప్పటికే అడవి శేషు మేజర్ నెమ్మదించగా విక్రమ్ స్టడీగా ఉంది. ఈ సినిమా కమల్ కెరీర్ లో మరో మైలు రాయిగా మిగిలింది. యాక్షన్ తో ఈ సినిమా జనాలను బాగానే ఆకట్టుకుంది. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాతో హాట్రిక్ కొట్టారు. ఈ సినిమాలో చేసిన విజయ్ సేతుపతి, సూర్య కు కూడా ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది.
88
ఇక అంతకు ముందు వారం రిలీజైన నాని అంటే సుందరానికి ఈదటం కష్టమే అనిపిస్తోంది. అలాగే క్రితం వారం రిలీజైన విరాట పర్వం, గాడ్సే లకు అసలు కలెక్షన్స్ లేవు. ఇవి మాస్, యూత్ ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.