ఈ ఫ్లాప్ సినిమాల రేంజ్ వేరు భయ్యా.. రీ రిలీజ్ చేస్తే 'ఆరెంజ్' తరహాలో సునామీ ఖాయం, కాదంటారా..

Published : Jul 06, 2023, 12:43 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల హంగామా కొనసాగుతోంది. హీరోల పుట్టినరోజులు, ఇతర కీలక సందర్భాలలో పాత చిత్రాలని 4కే రిజల్యూషన్ వెర్షన్ గా మార్చి రీరిలీజ్ చేస్తున్నారు.

PREV
17
ఈ ఫ్లాప్ సినిమాల రేంజ్ వేరు భయ్యా.. రీ రిలీజ్ చేస్తే 'ఆరెంజ్' తరహాలో సునామీ ఖాయం, కాదంటారా..

టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల హంగామా కొనసాగుతోంది. హీరోల పుట్టినరోజులు, ఇతర కీలక సందర్భాలలో పాత చిత్రాలని 4కే రిజల్యూషన్ వెర్షన్ గా మార్చి రీరిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు జల్సా, ఖుషి, ఆరెంజ్, తొలి ప్రేమ, సింహాద్రి, లాంటి చిత్రాలు రీ రిలీజ్ అయి సత్తా చాటాయి. ముఖ్యంగా జల్సా, ఆరెంజ్ చిత్రాలైతే రికార్డు స్థాయి రెస్పాన్స్ అందుకున్నాయి. 

 

27

దీనితో ఇతర చిత్రాల నిర్మాతలు కూడా స్టార్ హీరోలతో చేసిన చిత్రాలని రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే కొన్ని చిత్రాలని మాత్రం తప్పనిసరిగా రీరిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్న వాటిలో కొన్ని ఫ్లాప్ చిత్రాలు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కానీ అవన్నీ అండర్ రేటెడ్ మూవీస్. దురదృష్టం కావచ్చు, ఇతర కారణాలు ఉండొచ్చు అప్పట్లో ఆ చిత్రాలకు దక్కాల్సిన గుర్తింపు రాలేదు. ఆ చిత్రాల స్టామినా గుర్తించి ఇప్పుడు ఫ్యాన్స్ రీ రిలీజ్ కి డిమాండ్ చేస్తున్నారు. ఆ చిత్రాలు ఏవేవో ఇప్పుడు చూద్దాం. 

 

37

అంజి: 

మెగాస్టార్ చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో గ్రాఫిక్స్ మాయాజాలంగా ఫాంటసీ చిత్రంగా అంజి తెరకెక్కింది. 2004లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమాత్రం మెప్పించలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఆడియన్స్ ఈ చిత్రాన్ని టీవీల్లో, యూట్యూబ్ లో రిపీట్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగినప్పటికీ కొందరు దర్శకులు నాసిరకం గ్రాఫిక్స్ తో సినిమాలు చేస్తున్నారు. వాటితో పోల్చుకుంటే దాదాపు 20 ఏళ్ల క్రితం రిలీజైన అంజి విజువల్ వండర్ అనే చెప్పాలి. కథ కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ చిత్ర రీ రిలీజ్ కి మెగా ఫాన్స్ పట్టుబడుతున్నారు. 

47

1 నేనొక్కడినే :

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం డిజాస్టర్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ సుకుమార్ బెస్ట్ వర్క్ మూవీస్ లో ఈ చిత్రం కూడా ఉంటుంది. ఎంతో స్టైలిష్ గా సుక్కు ఈ చిత్రాన్ని రూపొందించారు. మహేష్ బాబు మానసిక సంఘర్షణ అనుభవిస్తూనే యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు. మేకింగ్ పరంగా ఈ చిత్రాన్ని మహేష్ ఫ్యాన్స్ క్లాసిక్ అని అంటుంటారు. త్వరగా ఈ మూవీని రీ రిలీజ్ చేస్తే రెస్పాన్స్ అదిరిపోతుందని అంటున్నారు. 

 

57

ఆర్య 2: 

ఇది కూడా సుకుమార్ చిత్రమే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ ఈ చిత్రంలో క్రేజీగా ఉంటుంది. మిస్టర్ ఫర్ఫెక్ట్ గా నటించడం ఆ తర్వాత గీత ప్రేమ కోసం ఎమోషనల్ గా మారడం అద్భుతంగా ఉంటుంది. బన్నీ తన పాత్రలో ఎన్నో వేరియషన్స్ చూపించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఒక సెన్సేషన్. కానీ ఎందుకో ఈ మూవీ హిట్ కాలేకపోయింది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే ఆ సాంగ్స్ కి, బన్నీ యాక్టింగ్ కి థియేటర్స్ బద్దలవుతాయి అని ఫ్యాన్స్ అంటున్నారు. 

 

67

గుడుంబా శంకర్ : 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ కాంబోలో వీర శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. కానీ పవన్ యాటిట్యూడ్, స్టైల్ ఫ్యాన్స్ కి భలే కిక్కిచ్చేలా ఉంటాయి. మణిశర్మ అందించిన సంగీతం మెస్మరైజ్ చేసే విధంగా ఉంటుంది. ఈ మూవీ రీరిలీజ్ అయితే పాటలు, పవన్ యాటిట్యూడ్ కోసమే ఫ్యాన్స్ థియేటర్స్ కి ఎగబడతారు. 

77

బుజ్జిగాడు :

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన బుజ్జిగాడు మాస్ ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రం. పూరి ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రని క్రేజీగా తీర్చిదిద్దారు. ప్రభాస్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ డిఫెరెంట్ లెవల్ లో ఉంటాయి. ప్రభాస్, త్రిష మధ్య కెమిస్ట్రీ కూడా గమ్మత్తుగా ఉంటుంది. అప్పట్లో ఈ చిత్రం నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు ప్రభాస్ అభిమానులు రీరిలీజ్ చేయాలని కోరుతున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories