టాలీవుడ్ యంగ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అయోధ్యలోనే పుట్టారు. త్రిపాఠి 15 డిసెంబర్ 1990న ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి హైకోర్టు, సివిల్ కోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. తల్లి రిటైర్డ్ టీచర్. ఇక గతేడాది వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకొని హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యింది.