Tollywood 2022: మే నెలలో తెలుగు రిలీజ్ ల లిస్ట్, రెండు పెద్దవి

Surya Prakash   | Asianet News
Published : May 04, 2022, 12:33 PM IST

భీమ్లానాయక్ నుంచి స్టార్టయిన సినిమా పండగ ఆర్.ఆర్.ఆర్ తో పీక్స్ కి చేరింది. ఆ తర్వాత కేజీఎఫ్ 2 వచ్చింది. సూపర్ హిట్ కలెక్షన్స్ తో థియోటర్స్ హోరెత్తిపోతున్నాయి.  

PREV
19
Tollywood 2022: మే నెలలో తెలుగు  రిలీజ్ ల లిస్ట్, రెండు పెద్దవి
Tollywood May 2022


భీమ్లానాయక్ నుంచి స్టార్టయిన సినిమా పండగ ఆర్.ఆర్.ఆర్ తో పీక్స్ కి చేరింది. ఆ తర్వాత కేజీఎఫ్ 2 వచ్చింది. సూపర్ హిట్ కలెక్షన్స్ తో థియోటర్స్ హోరెత్తిపోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఆచార్య  తో సహా పెద్ద సినిమాలు వరస పెట్టి రిలీజ్ అవుతూండటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెలలోనూ వరస సినిమా రిలీజ్ లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

29

భళా తందనానా 

బాణం మూవీ ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఓ సినిమా నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తవగా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఆ మధ్య ‘భళా తందనాన` ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా శ్రీవిష్ణు లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వారమే ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

39

అశోక వనంలో అర్జున కళ్యాణం

విశ్వక్ సేన్ హీరోగా ఈ నెల 6న రిలీజ్ కాబోతున్న సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. ఈ సినిమాలో రుక్షర్ ఢిల్హాన్ హీరోయిన్ గా నటిస్తోంది. విద్యాసాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుధీర్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కొత్తగా ట్రై చేయాలనుకుని, కాంట్రవర్శిలో చిక్కుకున్నాడు మాస్ కా దాస్.

49

జయమ్మ పంచాయతీ

ప్రముఖ యాంకర్ సుమ కనకాల నటించిన జయమ్మ పంచాయతీ ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కానుంది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.  వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేసింది మరియు ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.

59


సర్కారు వారి పాట

 సూపర్​ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ట్రైలర్​ రానే వచ్చింది. పరశురామ్​ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్​గా కీర్తి సురేష్​ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

69


గాడ్సే
    
ప్రతిభావంతుడైన న‌టుడిగా పేరు తెచ్చుకొని, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు స‌త్యదేవ్‌. ఆయ‌న హీరోగా గోపీగ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కనున్న చిత్రం ‘గాడ్సే’. సి.కె. స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత సి. క‌ళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాజ‌ర్‌, బ్రహ్మాజీ, ఆదిత్య మీన‌న్‌, కిశోర్ కీల‌క పాత్రధారులు. మే 20 న రిలీజ్ కానుంది.

79


కృష్ణ బృందా విహారి 

కృష్ణ బృందా విహారి అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో సినీ ప్రేమికులను అలరించేందుకు నాగ శౌర్య సిద్ధమవుతున్నాడు. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్. ఈ చిత్రం మే 20న రిలీజ్ చేయబోతున్నారు.ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

 

89
pellikuthuru party

పెళ్లికూతురు పార్టీ

ప్రిన్స్, అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా,  సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఎ.వి.ఆర్. స్వామి నిర్మించారు. అపర్ణ దర్శకత్వం వహించారు. లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం మే 20న సినిమాను విడుదల చేస్తున్నారు.

99


ఎఫ్3

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్‌ 'ఎఫ్‌3'. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 'ఎఫ్‌3'ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ కంపోజర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం వాలంటైన్స్‌ డే సందర్భంగా చిత్రబృందం కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ, 'ఎఫ్‌3' మే 27న థియేటర్లలోకి వస్తున్నట్లు వెల్లడించింది. 

 

click me!

Recommended Stories