ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలోకి హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా ఎంటర్ అయ్యారు. ఈ వ్యవహారంలో విశ్వక్ సేన్ ని తీవ్రంగా తప్పుబడుతూ ఆమె ట్వీట్ చేశారు. 'టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లిపై విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంతటి చిరాకు, కోపంలో ఉన్నా మహిళలపై అలాంటి పదాలు ఉపయోగించకూడదు. ఇలాంటి చర్యలని సహించం. విశ్వక్ సేన్ ఇలాంటి పదజాలం, చర్యలు మానుకోవాలి' అంటూ విజయలక్ష్మి ట్వీట్ చేశారు.