అదే విధంగా అప్పట్లో కొంతమంది స్టార్ హీరోయిన్లు రాజేంద్ర ప్రసాద్ తో నటించం అని చెప్పేవారు. ఎందుకంటే ఆయన కామెడీ హీరో అని అవమానించేవారు. ఆ టైంలో నన్ను హీరోయిన్ గా నటించమని అడిగారు. అప్పుడు నేను నాకు చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేదు.. కథ నచ్చితే ఎవరితో అయినా నటిస్తా అని చెప్పా. అది రాజేంద్ర ప్రసాద్ కి బాగా నచ్చింది. అందువల్లే నేనంటే ఆయనకి అభిమానం అని రజిని తెలిపారు. తమ ఎఫైర్ గురించి వచ్చిన వార్తలు మాత్రం నిజం కాదు అని అన్నారు.