Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎదుగుదలలో ఆయన భార్య సురేఖ సహకారం, బావ అల్లు అరవింద్ ప్లానింగ్ ఎంత కీలకం అయ్యయో ప్రముఖ నిర్మాత నారాయణరావు వివరించారు. ముఖ్యంగా 'పసివాడి ప్రాణం' సినిమా కోసం నారాయణరావు చేసిన ప్రయత్నాలు
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను సీనియర్ నటుడు జి.వి. నారాయణరావు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చిరంజీవి మెగాస్టార్ కావడమ వెనుక కేవలం ఆయన హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా, ఆయన కుటుంబం, స్నేహితుల తోడ్పాటు ఎంతో ఉందని జి.వి. నారాయణరావు వివరించారు. చిరంజీవి తండ్రి ఆయనను చాలా స్ట్రిక్ట్‌గా పెంచారు. అలాగే ఆయన భారత్ స్కౌట్స్‌లో ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ అలవడింది. షూటింగ్ సమయంలో ఆయన చూపించే అంకితభావం అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచేది.
25
సురేఖ ఓపిక, సహకారం
చిరంజీవి ఇంత ఆనందంగా, విజయవంతంగా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఆయన భార్య సురేఖ. ఆయన షూటింగ్స్ వల్ల ఎంత ఆలస్యంగా ఇంటికి వచ్చినా, ఆమె ఎంతో ఓపికగా చూసుకునేవారని, ఒక ధర్మపత్నిగా ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివని నారాయణరావు గుర్తుచేసుకున్నారు.
35
'పసివాడి ప్రాణం' సినిమా కోసం కిడ్నాప్ డ్రామా
చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన 'పసివాడి ప్రాణం' సినిమా రైట్స్ నారాయణరావు కొని తెచ్చారు. అయితే అప్పటికే వేరే హీరోతో ఆ సినిమా ప్రారంభం కావడంతో, ఒరిజినల్ చైల్డ్ ఆర్టిస్ట్ సుజితను, విలన్ రఘువరన్‌ను తాను 'కిడ్నాప్' చేసి చిరంజీవితోనే ఆ సినిమా చేసేలా పట్టుబట్టానని ఆయన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పారు.
ఒకానొక దశలో వరుస పరాజయాలతో చిరంజీవి కొంతకాలం బ్రేక్ తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు. ఆరు నెలల విరామం తర్వాత 'హిట్లర్' సినిమాతో బలమైన పునరాగమనం చేశారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.
55
అల్లు అరవింద్ మాస్టర్ ప్లానింగ్
చిరంజీవి సక్సెస్ వెనుక అల్లు అరవింద్ ప్లానింగ్ అద్భుతమని ఆయన కొనియాడారు. సినిమా ఎప్పుడు మొదలవ్వాలి, ఎప్పుడు విడుదలవ్వాలి, 100 రోజుల ఫంక్షన్ ఏ ఏ ఊర్లలో చేయాలి అనే విషయాల్లో అరవింద్ వ్యూహాలు చిరంజీవికి కొండంత అండగా నిలిచాయి.