The RajaSaab బాక్సాఫీసు టార్గెట్‌ ఇదే, ప్రభాస్‌ రేంజ్‌ ఇలా ఉంటది.. ఏమాత్రం తేడా కొట్టినా మునిగిపోవాల్సిందే

Published : Jan 06, 2026, 07:32 PM IST

ప్రభాస్‌ హీరోగా నటించిన `ది రాజాసాబ్‌` మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీసు టార్గెట్‌ ఎంతా అనేది తెలుసుకుందాం. 

PREV
14
ఈ నెల 9న రిలీజ్‌ కాబోతున్న ప్రభాస్‌ `ది రాజా సాబ్‌`

ప్రభాస్‌ ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద స్టార్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన పేరుతో జరిగే బిజినెస్‌ అంతా ఇంతా కాదు, మరే హీరోకి కూడా ఆ రేంజ్‌లో వ్యాపారం జరగదు. ఆయన ఫ్లాప్‌ మూవీస్‌ కూడా ఈజీగా మూడు నాలుగు వంద కోట్లు వసూలు చేస్తాయంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆయన `ది రాజా సాబ్‌` చిత్రంతో రాబోతున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 9న విడుదల కాబోతుంది. ఫాంటసీ హర్రర్‌ కామెడీగా దీన్ని రూపొందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఇందులో మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. సంజయ్‌ దత్‌ ముఖ్య పాత్ర పోషించారు.

24
ది రాజా సాబ్‌ మూవీ బాక్సాఫీసు టార్గెట్‌

`ది రాజా సాబ్‌` విడుదలకు ఇంకా రెండు రోజులే ఉంది. ఈ నెల 8 సాయంత్రం నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. మరి ఈ సినిమాకి ఎంత బిజినెస్‌ అయ్యింది. ఎంత బడ్జెట్‌ అయ్యిందనేది చూస్తే, ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రభాస్‌ ముందు భారీ టార్గెట్‌ ఉందని తెలుస్తోంది. దీనికి గట్టిగానే వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. నిర్మాతలు ఇప్పటికే సేఫ్‌లో ఉన్నారట. కానీ సినిమాని కొన్న బయ్యర్ల పరిస్థితి ఏంటనేది మాత్రం రిలీజ్‌ అయ్యాక రిజల్ట్ నిర్ణయిస్తుంది. ఇక సినిమాకి జరిగిన వ్యాపారం చూస్తే.

34
ది రాజా సాబ్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ లెక్కలు

`ది రాజాసాబ్‌` మూవీకి సుమారు రూ. 350కోట్ల వరకు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందట. తెలుగు రాష్ట్రాల్లో ఇది రూ.120కోట్లకు అమ్ముడు పోయిందట. హిందీ, కర్నాటక, తమిళనాడు, కేరళా కలుపుకుని రూ.75కోట్ల వ్యాపారం జరిగిందట. ఇందులో రూ.15కోట్లు కర్నాటక, రూ.8కోట్లు తమిళనాడు, రూ.4 కోట్లకు కేరళ హక్కులు సేల్‌ అయ్యాయట. మిగిలింది హిందీలో బిజినెస్‌ అయ్యిందని సమాచారం. ఇక ఓవర్సీస్‌ మాత్రం గట్టిగానే జరిగింది. రూ.80కోట్లకు అక్కడి హక్కులు సేల్‌ అయ్యాయట. ఈ లెక్కన `ది రాజాసాబ్‌` మూవీకి థియేట్రికల్‌ హక్కులు రూ.280-300కోట్ల మధ్య అమ్ముడు పోయిందని సమాచారం. 

44
ది రాజా సాబ్‌ ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్

ఇక ఈ మూవీకి ఓటీటీ, శాటిలైట్‌ హక్కులు కూడా గట్టిగానే అమ్ముడు పోయాయట. జియో హాట్‌ స్టార్‌ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని తీసుకుంది. అలాగే స్టార్‌ నెట్‌ వర్క్ శాటిలైట్‌ హక్కులు తీసుకుందట. దీంతోపాటు ఆడియో రైట్స్ కలుపుకుని రూ.180కోట్లకు సేల్‌ అయినట్టు సమాచారం. ఇలా సుమారు రూ.450కోట్ల వరకు ఈ మూవీకి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని  తెలుస్తోంది. ఈ సినిమాకి సుమారు రూ. 400కోట్ల బడ్జెట్‌ అయ్యింది. దీంతో నిర్మాత ఇప్పటికే సేఫ్‌ అయ్యారట. సినిమా ఆరు వందల కోట్ల నుంచి రూ.700కోట్ల గ్రాస్‌ వసూలు చేస్తేనే బయ్యర్లు సేఫ్‌లో ఉంటారు. లేదంటే తీవ్రమైన నష్టాలు తప్పవు. హిట్‌ అయితే మాత్రం వెయ్యి కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. కానీ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Note: ఈ సినిమా బడ్జెట్‌, బిజినెస్‌ లెక్కలు పూర్తిగా సోషల్‌ మీడియా ఆధారంగా తీసుకున్నవే. వీటిని ఏసియానెట్‌ ధృవీకరించదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories