సంక్రాంతి సందర్భంగా విడుదలైన మూవీస్‌లో రవితేజ మూవీకి నవీన్ పొలిశెట్టి మూవీ గట్టి దెబ్బ కొట్టింది. బాక్సాఫీసు వసూళ్ల పరంగా `అనగనగా ఒక రాజు` మూవీ భారీ కలెక్షన్లని రాబట్టింది.
సంక్రాంతి సినిమాలు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తున్నాయి. బాగున్న సినిమా వసూళ్ల వర్షం కురిపించుకుంటోంది. బాలేని చిత్రాలు స్ట్రగుల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ `ది రాజా సాబ్` బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్ అవుతుంది. చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు దుమ్ములేపుతుంది. ఆ కోవలోనే ఆద్యంతం అలరిస్తోంది నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన `అనగనగా ఒక రాజు` మూవీ. ఇది ఊహించని విధంగా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. రవితేజకి మూవీకి పెద్ద షాకిచ్చింది.
25
అనగనగా ఒక రాజు మూవీకి పాజిటివ్ టాక్
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదీ జంటగా నటించిన `అనగనగా ఒక రాజు` మూవీ గురువారం జనవరి 14న విడుదలైంది. దీనికి మారి దర్శకుడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. సంక్రాంతి ఫీల్‌ని తెచ్చే మూవీ ఇదే అని చెప్పొచ్చు. అన్ని అంశాలను మేళవించి రూపొందించారు. బుధవారం విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఫస్ట్ డే ఇది ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతుంది.
35
అనగనగా ఒక రాజు మూవీ మొదటి రోజు కలెక్షన్లు
`అనగనగా ఒక రాజు` మూవీ మొదటి రోజు ఏకంగా రూ.22 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ విషయాన్ని చిత్రం బృందం వెల్లడించింది. ఈ మేరకు కలెక్షన్లతో కూడిన పోస్టర్‌ని విడుదల చేసింది. `రాజుగారు అసలైన సంక్రాంతి సంబరాలు తెచ్చేశారు. ఇంటిళ్లి పాది నవ్వుల సునామీ తెచ్చారు` అంటూ ఈ పోస్టర్‌ని ఇవడుదల చేయడం విశేషం.
ఇదిలా ఉంటే నవీన్ పొలిశెట్టి ఇప్పుడు రవితేజకి పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. రవితేజ నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ మొదటి రోజు దాదాపు ఐదు కోట్లు వసూలు చేసింది. రెండో రోజు మూడు కోట్లు రాబట్టింది. మొత్తంగా ఎనిమిది కోట్లు చేసింది. ఇప్పుడు కానీ `అనగనగా ఒక రాజు` మూవీ ఒక్క రోజులోనే రూ.22కోట్లు రాబట్టడం విశేషం. ఇది రవితేజ మూవీకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.
55
ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోయే హీరో కథతో బీఎండబ్ల్యూ
రవితేజ హీరోగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన `భర్త మహాశయులకు విజ్ఞప్తి`(బీఎండబ్ల్యూ) మూవీ ఈ సంక్రాంతికి జనవరి 13న విడుదలైంది. దీనికి కిశోర్ తిరుమల దర్శకుడు. దీనికి యావరేజ్ టాక్ వస్తోంది. ఇది కూడా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయిన మగాడి కథతోనే రూపొందింది. నవ్వులు పూయించడంలో కొంత వరకు సక్సెస్ అయ్యింది.