Paradise 3 Days Collections: ప్యారడైజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు, వామ్మో ఈ రేంజ్‌లోనా.. నానిని ఆపడం కష్టమే

Published : Sep 27, 2026, 07:28 AM IST

నాని, కయాదు లోహర్‌ జంటగా మోహన్‌ బాబు విలన్‌గా నటించిన `ది ప్యారడైజ్‌` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి వసూళ్లు స్టడీగా ఉన్నాయి. మూడో రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

PREV
14
నెగటివ్‌ నుంచి పాజిటివ్‌గా మారిన ప్యారడైజ్‌ రిజల్ట్

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన `ది ప్యారడైజ్‌` మూవీ మొదట నెగటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా, ఆ తర్వాత క్రమంగా పాజిటివ్‌ టాక్‌ని రాబట్టుకుంది. సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌, నెగటివ్‌ పోస్ట్ లు టీమ్‌ని కలవరానికి గురి చేశాయి. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం ఈ చిత్రం తన సత్తాని చాటింది. నాని కెరీర్లోనే కనీవినీ ఎరుగని కలెక్షన్లని తొలి రోజు రాబట్టుకుంది. అత్యధిక ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇప్పుడు రెండో రోజు, అలాగే మూడో రోజు కూడా ఈ చిత్రానికి కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఇక నాల్గో రోజు ఆదివారం పెరిగే అవకాశం కనిపిస్తుంది.

24
ప్యారడైజ్‌ మూడు రోజుల కలెక్షన్లు

ఇదిలా ఉంటే మూడు రోజుల్లో ఈ మూవీ ఎంత రాబట్టింది. మూడో రోజు దీనికి ఎంత వచ్చాయనేది చూస్తే, శనివారం ఈ మూవీకి రూ.15.25కోట్ల ఇండియా నెట్‌ వచ్చింది. ఓవర్సీస్‌లో నాలుగు కోట్లు రాబట్టింది. మొత్తంగా మూడో రోజు `ది ప్యారడైజ్‌` మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.24 గ్రాస్‌ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది మూడు రోజుల్లో రూ.119.50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లని వసూలు చేసింది. ఇండియాలో రూ.90.50కోట్లు, ఓవర్సీస్‌లో రూ.29కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ లెక్కన ఈ మూవీకి అరవై కోట్ల షేర్‌ వచ్చింది. ఇంకా నలభై కోట్ల షేర్‌ వస్తే, అంటే ఎనబై కోట్ల గ్రాస్‌ రాబడితే సినిమా హిట్‌గా చెప్పొచ్చు.

34
60శాతం కలెక్షన్లని రాబట్టిన ప్యారడైజ్‌

`ది ప్యారడైజ్‌` మూవీకి అయిన బడ్జెట్‌ ప్రమోషన్స్ తో కలుపుకొని రూ.150కోట్లు అని సమాచారం. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ రూపంలో దాదాపు రూ.80 నుంచి వంద కోట్లు వచ్చినట్టు సమాచారం. అందులో నెట్‌ ఫ్లిక్స్ సుమారు రూ.50కోట్లకి తీసుకుందట. ఆడియోరైట్స్ రూపంలో మరో రూ.15కోట్లు వచ్చిందని సమాచారం. శాటిలైట్‌ రూపంలో బాగానే వచ్చిందట. ఇక థియేట్రికల్‌ రైట్స్ సుమారు వంద కోట్లుగా లెక్క కట్టారట. దీంతో రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్‌తో థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే అరవై శాతం వసూళ్లని రాబట్టింది. లాంగ్‌రన్‌లో టార్గెట్‌ని ఈజీగా రీచ్‌ అవుతుందని చెప్పొచ్చు.

44
సవారీల గుర్తింపు కోసం జడల్‌ తిరుగుబాటు

`దసరా` ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో నాని నటించిన `ది ప్యారడైజ్‌` మూవీలో కయాదు లోహర్‌ హీరోయిన్‌. మోహన్‌ బాబు, సంపూర్ణేష్‌ బాబు, ప్రియదర్శి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. రా అండ్‌ రస్టిక్‌, మాస్‌ కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం సవారీ అనే జాతి తమ గుర్తింపు కోసం చేసిన పోరాటం నేపథ్యంలో సాగిన కథ. 200 ఏళ్లుగా గుర్తింపుకు నోచుకోని జాతి.. తమ గుర్తింపు కోసం జడల్‌ గా నాని చేసిన తిరుగుబాటే ఈ మూవీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories