ఇద్దరు తెలుగు సూపర్‌ స్టార్లకి తండ్రిగా రజనీకాంత్.. ఆయనకు కథ చెప్పిన డైరెక్టర్‌ డేర్‌కి మొక్కాలి

Published : Feb 26, 2025, 05:35 PM IST

`పెదరాయుడు` తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తెలుగులో మరో సినిమా చేయాల్సి ఉంది, ఇద్దర సూపర్‌ స్టార్లకి తండ్రి పాత్రలో ఆయన నటించాల్సి ఉంది. మరి ఎందుకు వర్కౌట్‌ కాలేదు.   

PREV
15
ఇద్దరు తెలుగు సూపర్‌ స్టార్లకి తండ్రిగా రజనీకాంత్.. ఆయనకు కథ చెప్పిన డైరెక్టర్‌ డేర్‌కి మొక్కాలి
Rajinikanth

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్ ప్రారంభంలో తెలుగులో అడపాదడపా సినిమాలు చేశారు. ఆ మధ్య `పెదరాయుడు`లోనూ ఆయన గెస్ట్ రోల్‌ చేశారు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆయన తెలుగు సినిమాల్లో కనిపించింది లేదు. తన సినిమాలతోనే తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. 

25

అయితే ఆ మధ్య తెలుగులో మల్టీస్టారర్‌ సినిమా చేయాల్సి ఉండి. ఓ తెలుగు స్టార్‌ డైరెక్టర్ ఏకంగా వెళ్లి ఏకంగా రజనీకాంత్‌కే కథ చెప్పాడట. ఇద్దరు తెలుగు సూపర్‌ స్టార్లు నటించే మూవీలో వారికి ఫాదర్‌ రోల్‌ కోసం రజనీకాంత్‌ని అప్రోచ్‌ అయ్యాడట తెలుగు డైరెక్టర్‌. బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ చేయాలని భావించాడట. మరి ఆ కథేంటో చూస్తే. 

35

తెలుగులో ఈ జనరేషన్‌ మల్టీస్టారర్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేష్‌, మహేష్‌ బాబు హీరోలుగా నటించారు. వారికి తండ్రిగా ప్రకాష్‌ రాజ్‌ చేశాడు. దిల్‌ రాజు నిర్మించిన ఈ మూవీ 2013లో విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. మల్టీస్టారర్స్ లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. 

45
Rajinikanth

ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ పాత్ర కోసం రజనీకాంత్‌ని కలిశాడట దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. చెన్నైకి వెళ్లి మరీ కథ చెప్పాడట. నలభై నిమిషాల పాటు కథ నెరేట్‌ చేశాడట. స్క్రిప్ట్ ఆయనకు బాగా నచ్చింది. కానీ ఆరోగ్యం బాగా లేదని, తాను ఇప్పుడు చేయలేనని తెలిపారు.

దీంతో చేసేదేం లేక సైలెంట్‌గా తిరిగి వచ్చాడట. సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ మనుషుల గురించి చెప్పే సీన్‌ ఉంటుంది. ఆ మాటని రజనీకాంత్‌  చెబితే బాగుంటుందని, అందరికి రీచ్‌ అవుతుందని చెప్పారు శ్రీకాంత్‌ అడ్డాల. 

55

అంతేకాదు మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. శ్రీకాంత్‌ అడ్డాలకి చెన్నైలోని శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారట. అక్కడికి వెళ్లి కూర్చున్నాక వెనకాల నుంచి ఓ వ్యక్తి వచ్చిన మంచి నీళ్లు తాగుతారా అని అడిగారు, అబ్బే వద్దులేండి అన్నాడట. ఆ తర్వాత వెళ్లి కాసేపు తర్వాత వచ్చాడట. ఆయనే రజనీకాంత్‌.

కానీ మొదటిసారి ఆయన్ని తాను గుర్తు పట్టలేదట, ఇంత సింపుల్‌గా ఉన్నారేంటి? అనుకున్నాడట. తర్వాత ఆయన్ని చూసి షాక్‌ అయ్యాడట. అదొక బెస్ట్ ఎక్స్ పీరియెన్స్ అని, తన జీవితంలో రజనీకి కథ చెప్పిన అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందని తెలిపారు శ్రీకాంత్‌ అడ్డాల. ప్రస్తుతం ఆయన కామెంట్‌ వైరల్‌ అవుతుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories