Sara Arjun: దురంధర్ సినిమాతో హీరోయిన్ గా మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టింది సారా అర్జున్. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లంగా వోణీలో ఎంతో అందంగా కనిపిస్తోంది సారా.
సారా అర్జున్ నటిగా మనకు ఎప్పుడో పరిచయం. బాలనటిగా నాన్నా సినిమాలో అందరి మనసులను గెలుచుకుంది. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా కేవలం ఏడేళ్ల వయసులోనే సారా చూపించిన అభినయం ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. ఇప్పుడు సారా పూర్తిస్థాయి హీరోయిన్ గా దురంధర్ సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఇప్పుడు సారా అర్జున్ కు వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి.
24
ప్రకటనల్లో తొలిగా..
సారా అర్జున్ సినీ ప్రయాణం మొదట వాణిజ్య ప్రకటనలతో మొదలైంది. టీవీ ప్రకటనలలో ఆమె చిన్న వయసులోనే నటించడం మొదలుపెట్టింది. దాంతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కథకు ప్రాణం పోసే పాత్రలను సారాకు అప్పగించారు. సారా అర్జున్ కేవలం ఒకే భాషకు పరిమితం కాలేదు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించింది.
34
పొన్నియన్ సెల్వన్ సినిమాలో
దర్శకులు ఏం చెప్పినా కూడా తన కళ్లతోనే ఆ భావాలను వ్యక్తపరచడం సారా అర్జున్ కు ఉన్న బలం. పెద్ద నటీమణులతో సమానంగా ఆమె చక్కగా నటించగలదు. పొన్నియన్ సెల్వన్ సినిమాలో చిన్నప్పటి ఐశ్వర్య రాయ్ గా అద్భుతంగా నటించింది. చిన్న వయసులోనే నటనలో చూపిస్తున్న పరిణతి, ఓర్పు ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. సారా అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అవి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.
సారా అర్జున్ 2019లో వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో చిన్న పాత్రలో నటించింది. 2022లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, 2023లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2లో కూడా నందిని పాత్రలో నటించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో హీరోయిన్ గా మారింది.