Chiranjeevi
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈమధ్య సక్సెస్ లు లేక ఇబ్బందిపడుతున్నాడు చిరంజీవి. ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు మెగాస్టార్. ఈ క్రమంలోనే ఆయన పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఇక చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లకు పైగా అవుతోంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. తన టాలెంట్ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు చిరు.
అంతే కాదు ఆ ఇమేజ్ ను మెగా బ్రాండ్ గా మార్చారు చిరు. ఇప్పుడు ఇండస్ట్రీలో అతి పెద్ద సినిమా కుటుంబంగా చిరంజీవి మెగా ఫ్యామిలీ నిలిచింది అంటే.. అందులో చిరంజీవి కృషి ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చిరంజీవి ఈ 40 ఏళ్ళలో ఎన్నో సినిమాలు చూసి ఉంటారు. డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ ను చేసి ఉంటారు.
Chiranjeevi, vishwambara, release date
కాని ఇన్నేళ్లలో.. ఇన్ని సినమాలలో మెగాస్టార్ ను భయపెట్టిన హరర్ సినిమా గురించి మీకు తెలుసా..? అవును ఓ సందర్భంలో మెగాస్టార్ చెప్పిన దాని ప్రకారం.. ఆయనను ఓ హరర్ సినిమా నిజంగా భయపెట్టిందట. అది కూడా ఇండియాన్ సినిమా.. సౌత్ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా.. రాఘవా లారెన్స్ చేసిన కాంచన. అవును ఆ సినిమా అంటే మెగాస్టార్ కు చాలా ఇష్టమట.
అంతే కాదు ఆ సినిమా చూసి కాస్త నేను కూడా భయపడ్డాను అన్నారట చిరంజీవి. రాఘవా లారెన్స్ యాక్ట్ చేస్తూ.. డైరెక్ట్ చేసిన సినిమా అది. అందులోను రాఘవను ఎంకరేజ్ చేస్తూ.. తన తమ్ముడిలా చూసుకున్నారు మెగాస్టార్. అయితే తను చేసిన ఈ సినిమాను చూసిన చిరంజీవి మూవీ అధిరింది కాని నన్ను భయపెట్టింది అంటూ సరదాగా చెప్పారట.
మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న చిరు.. మంచి హిట్ కోసం ఎదరు చూస్తున్నారు.
Raghava Lawrence
అటు రాఘవ లారెన్స్ మాత్రం ఈమధ్యపెద్ద సినిమాలేవి తెరపైకి తీసుకురాలేదు. చాలా గ్యాప్ ఇచ్చాడు రాఘవ. కాంచన సినిమాకు సబంధించి దాదాపు 20 సిరీస్ లు తసీుకువస్తానని గతంలో చెప్పాడు రాఘవ. అయితే ఈసిరిస్ లోనే వచ్చిన చంద్రముఖి2 డిజాస్టర్ అవ్వడంతో...రాఘవ ఈ గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది.