డైరక్టర్ వెంకట్ ప్రభు ఇలా మాట్లాడుతున్నాడేంటి, చిప్ దొబ్బిందా

First Published | Sep 10, 2024, 11:10 AM IST

 నార్త్ బెల్ట్, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అసలు కనపడటం లేదు.  దాంతో వెంకట్ ప్రభుకు కోపం వచ్చింది. షాకింగ్ కామెంట్స్ చేసారు. 


తాము డైరక్ట్ చేసిన సినిమాపై  ప్రతీ దర్శకుడుకి నమ్మకం ఉంటుంది. ఆ క్రమంలో సినిమా రిజల్ట్ తేడా కొడితే ఒక్కోసారి ఏం మాట్లాడుకున్నారో అర్దం కాదు. ఇప్పుడు అదే పరస్దితి ఎదురైంది డైరక్టర్ వెంకట్ ప్రభుకి.  తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)తో ఆయన రూపొందించిన  ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The Greatest of All Time Movie) భారీ అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.

అయితే ఊహించని విధంగా  ఈ సినిమా డివైడ్  టాక్‌ను సొంతం చేసుకుంది. అప్పటికి సినిమా నిండా క్యామియోలు, సర్పైజ్ ఎలిమెంట్స్ ని నింపేసారు.  ఆడియన్స్ వాటిని చూసి అసలు కథని మర్చిపోయి మరీ మురిసిపోతారనుకుంటే అది జరగటం లేదు. మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్, కేరళ, తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అసలు కనపడటం లేదు.  దాంతో వెంకట్ ప్రభుకు కోపం వచ్చింది. షాకింగ్ కామెంట్స్ చేసారు. 

Director Venkat prabhu

 
 దర్శకుడు వెంకట్ ప్రభు ఇటీవల ట్విట్టర్ స్పేస్‌లో పాల్గొన్నాడు, ఈ సందర్భంగా అతను ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. సినిమాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ని హైలైట్ చేసే సన్నివేశాలు తెలుగు ,   హిందీ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని వెంకట్ ప్రభు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాలు మరియు హిందీ బెల్ట్‌లో GOAT వర్కవుట్ కాకపోవటానికి  ఇది కారణమని పేర్కొన్నారు. ఈ కామెంట్  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంకట్ ప్రభుకు తన సినిమా రిజల్ట్ చూసి చిప్ దొబ్బి ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ కామెంట్ ని చూపుతూ వెంకట్ ప్రభు ని ట్రోల్ చేస్తున్నారు.  


 
సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాలో ‘డీ-ఏజింగ్‌’ టెక్నాలజీని వినియోగించారు. దీని సాయంతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు.

తమిళ చరిత్రలోనే భారీస్థాయిలో (తమిళనాడులో ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో) ఈ సినిమా విడుదలై రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం ఇండియాలోనే రూ.135 కోట్లు సాధించింది.

Venkat prabhu


అయితే  ‘ది గోట్‌’చిత్రం తమిళనాడు,ఓవర్సీస్ లో అదరకొడుతున్నా మిగతా చోట్ల పెద్దగా ఆ ఇంపాక్ట్ కనపడటం లేదు. కర్ణాటక,నార్త్ ఇండియాలో సినిమా జస్ట్ ఓకే అన్నట్లుగా కలెక్షన్స్ సంపాదిస్తోంది. తెలుగు, కేరళ కు వచ్చేసరికి పూర్తి డ్రాప్ కనపడి , డిజాస్టర్ గా ముగిస్తోంది. ఇప్పటిదాకా ఏ పెద్ద సినిమాకు ఇలాంటి పరిస్దితి ఎదురుకాలేదు.

ఈ సినిమా కేరళ, తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలను చవిచూసింది. AP & తెలంగాణలలో, బ్రేక్ఈవెన్ 40 కోట్ల గ్రాస్ వద్ద ఉంది మరియు ఈ వెంకట్ ప్రభు చిత్రం కేవలం 9 కోట్లు వసూలు చేయగలిగింది. ఈ చిత్రం బ్రేక్‌ఈవెన్ 45 కోట్ల వద్ద ఉన్నందున కేరళలో ఏటవాలు కొండను అధిరోహించాల్సి ఉంది మరియు ఇది దాదాపు 11 కోట్లు వసూలు చేసింది.

Venkat Prabhu

 
ఈ సినిమా కేరళ, తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలను చవిచూడటం ఆశ్చర్యపపరుస్తోంది. AP & తెలంగాణలలో, బ్రేక్ఈవెన్ 40 కోట్ల రావాల్సి ఉంది. అయితే  వెంకట్ ప్రభు చిత్రం కేవలం 9 కోట్లు  మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ చిత్రం కేరళలో  బ్రేక్‌ఈవెన్ 45 కోట్ల  రావాల్సి ఉంది. అయితే కేరళలో కేవలం  11 కోట్ల వరకు వసూలు చేసింది.

Venkat Prabhu

 
చిత్రం కథేమిటంటే...దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో అతను ఓ మిషన్‌లో తన కొడుకును కోల్పోవలసి రావడం.. కొద్ది కాలనికే  ఆ కొడుకే 15ఏళ్ల తర్వాత తన పాలిట యముడిలా మారి దేశానికి పెను సమస్యలా మారడం.. ఈ క్రమంలో అతని ఆట కట్టించేందుకు ఆ తండ్రి ఏం చేశాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం.

నిజానికి ఈ కథ (GOAT Movie Story)లో పెద్దగా కొత్తదనమేమీ లేకున్నా.. స్క్రీన్‌ప్లే స్పెషలిస్ట్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన సినిమా (GOAT Movie) కావడంతో దీంట్లో తప్పకుండా ఓ మ్యాజిక్ కనిపిస్తుందన్న భరోసా ప్రేక్షకుల్లో కపిస్తుంది. అయితే అలాంటిది జరగలేదు. 

Latest Videos

click me!