Published : Jun 21, 2022, 01:47 PM ISTUpdated : Jun 21, 2022, 01:54 PM IST
బుల్లితెర బ్యూటీ, యాంకర్ అనసూయపై టాలీవుడ్ సీనియర్ దర్శకుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె డ్రెస్ సెన్స్, నటనపై ఆసక్తికరంగా స్పందించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బుల్లితెర బ్యూటీ, యాంకర్ అనసూయ (Anchor Anasuya)కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై అందాలు ఆరబోస్తూనే.. ఇటు విభిన్న పాత్రల్లో వెండితెరపై తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో జోరు పెంచింది.
27
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘రంగస్థలం’తో రంగమ్మత్తగా నటించింది అనసూయ. గ్రామీణ మహిళగా చక్కగా నటించింది. అప్పటి నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
37
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (All Arjun) చిత్రంలోనూ మంగళం శ్రీను భార్యగా దాక్షాయణి పాత్రలో నటించింది. ఈ పాత్రతో ఇక అనసూయ పాపులారిటీ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటింది. అదే జోష్ తో ఆమె వరుస సినిమాలను ప్రకటిస్తూ షాకిస్తోంది. మున్ముందు కూడా ఈ బ్యూటీ ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో కనిపించేలా ప్లాన్ చేసుకుంది.
47
అటు ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ యాంకర్ గానూ కొనసాగుతున్న అనసూయ స్మాల్ స్క్రీన్ పై, వెండితెరపై అందాలు ఆరబోస్తోంది. ముఖ్యంగా ఈ బ్యూటీ జబర్దస్త్ షోకోసం ప్రతి వారం లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తుంటుంది. అలాగే ప్రతి ఎపిసోడ్ లోనూ ట్రెండీ అవుట్ ఫిట్ లో అదరగొడుతుంది. గతంలో ఈమె డ్రెసింగ్ పైనా నెటిజన్లు కామెంట్లు, ట్రోలింగ్ కూడా చేసిన విషయం తెలిసిందే.
57
తాజాగా టాలీవుడ్ సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ కూడా కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అనసూయ గురించి మాట్లాడుతూ.. అనసూయ డ్రెసింగ్ సెన్స్ అంటే తన చాలా ఇష్టమని, ఆమె ఫ్యాషన్ సెన్స్ కొత్తగా ఉంటుందని తెలిపారు. ట్రెండీగా ఉండే అనసూయ వస్త్రాధరణ ఆయనకు నచ్చుతుందన్నారు.
67
అలాగే, ఆమె నటనలోనూ కొత్తదనం చూపిస్తోందన్నారు. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రతో ఆకట్టుకుందన్నారు. మొన్నటి ‘పుష్ఫ’లోనూ దాక్షయణిగా నటనా ప్రతిభను చూపించిందని తెలిపారు. మున్ముందు అనసూయకు మరిన్ని మంచి పాత్రలు దక్కుతాయని అభిప్రాయపడ్డారు. అనసూయను పొగుడుతూ ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
77
‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షలకులతో ఒకే అనిపించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తోంది. ‘దర్జా, వాంటెండ్ పండుగాడ్, సింబా, పుష్ఫ : ది రూల్, రంగ మార్తండా’ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.