దివ్య భారతి కోసం స్టార్‌ హీరో చేసిన పనికి నిర్మాత బలి.. పాపం నిండా ముంచేశాడుగా!

First Published | Jan 24, 2024, 2:02 PM IST

దివ్య భారతి ఒకప్పుడు తెలుగు, హిందీ పరిశ్రమని ఊపేసింది. కరెక్ట్ గా మూడేళ్లే ఇండస్ట్రీలో ఉంది. కానీ చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఆమె కారణంగా ఓ హీరో నిర్మాతని ముంచడం హాట్‌ టాపిక్ అవుతుంది. 

దివ్య భారతి అంటే అందమైన రూపం, అద్భుతమైన నటనకు కేరాఫ్‌. ఆ టైమ్‌లో చిత్ర పరిశ్రమని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్‌. ఆ కాలంలో సినీ ఇండస్ట్రీలో ట్రెండింగ్‌ హీరోయిన్‌. అతిపిన్న వయసులోనే అసాధారణ గుర్తింపు పొంది స్టార్ హీరోయిన్ ఎదిగింది. సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం జరిగిన ఆమె మరణం నేటికీ మిస్టరీనే! అంత స్టార్ హీరోయిన్ అనుమానాస్పదంగా మృతి చెంది ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. 
 

అయితే దివ్య భారతితో సినిమా తీసి పెద్ద హిట్‌ అందుకున్న ఓ పెద్ద హీరో, ఆ తర్వాత ఆమెతో అదే కాంబినేషన్‌ రిపీట్‌ చేసి బోల్తా పడ్డాడు. కానీ నిర్మాతని ముంచేశాడు. ఇప్పుడిది ట్రెండింగ్‌లోకి రావడం గమనార్హం. మరి ఆ హీరో ఎవరు, ఏం జరిగింది అనేది ఓ సారి చూస్తే.. 


మోహన్‌బాబు.. దివ్య భారతితో కలిసి మొదట `అసెంబ్లీ రౌడీ` సినిమా తీశాడు. దీనికి మాస్‌, కమర్షియల్‌ సినిమాల దర్శకుడు బి గోపాల్‌ దర్శకత్వం వహించారు. పి వాసు కథ అందించారు. ఈ మూవీని మోహన్‌బాబు తన లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ లో నిర్మించారు. ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంతోనే మోహన్‌బాబుకి కలెక్షన్ కింగ్‌ అనే పేరు కూడా వచ్చింది. మోహన్‌బాబు కెరీర్‌లో అసెంబ్లీ రౌడీ అనేది బిగ్గెస్ట్ హిట్‌ మూవీ. 
 

ఈ ఊపులో దివ్య భారతితో మరో సినిమా చేశాడు మోహన్‌బాబు. `చిట్టెమ్మ మొగుడు` చిత్రాన్ని తీశారు. కోదండ రామిరెడ్డి దీనికి దర్శకుడు. మొదట ఈ మూవీని తనేనిర్మించాలనుకున్నారు మోహన్‌బాబు. కానీ స్క్రిప్ట్ తేడాగా ఉండటంతో, సినిమాలే మరోలా వస్తుందని ముందే గ్రహించి వేరే నిర్మాతకి అప్పగించారు. అలా శ్రీధర్‌ రెడ్డి తన `శ్రీ సాయి శాంతి ఫిల్మ్స్` ద్వారా నిర్మించారు. కానీ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఘోర పరాజయం చెందింది. దీంతో నిర్మాతకి దారుణమైన నష్టాలను తెచ్చిపెట్టింది. ఇలా ఈ నిర్మాత ఒక్క దెబ్బతో మునిగిపోయాడు. 

ఆ తర్వాత ఏడాదికే దివ్య భారతి కన్నుమూసింది. ఆమె మరణం మిస్టరీగా మారింది. దివ్య భారతి తెలుగు, హిందీలోనే సినిమాలు చేసింది. తెలుగులో ఆమె `బొబ్బిలి రాజా`, `అసెంబ్లీ రౌడీ`, `రౌడీ అల్లుడు`, `ధర్మ క్షేత్రం`, `చిట్టెమ్మ మొగుడు`, `తొలిముద్దు` చిత్రాల్లో నటించింది. `తొలి ముద్దు` సమయంలోనే ఆమె మరణించింది. దీంతో ఆమె స్థానంలో రంభని తీసుకున్నారు. ఇక హిందీలో పదికిపైగా సినిమాలు చేసి మెప్పించింది. ఎవర్‌గ్రీన్‌ హీరోయిన్‌గా నిలిచింది దివ్య భారతి. 
 

Latest Videos

click me!