ఈ సందర్భంగా తాను కూడా ఇంట్లో కాషాయ చీర ధరించి శ్రీరాముడికి పూజ చేస్తున్నట్లు రష్మీ పేర్కొంది. తనని ఎంతమంది ట్రోల్ చేసినా తాను చేసే పనులు చేస్తూనే ఉంటానని రష్మీ పేర్కొంది. జనవరి 22న రెండవ దీపావళి సెలెబ్రేట్ చేసుకోవాలని.. శ్రీరాముడు, సీతా మాత తమ ఇంటికి తిరిగి వచ్చిన శుభ సందర్భం ఇది అంటూ రష్మీ ట్వీట్ చేసింది. అప్పటి నుంచి రష్మీకి సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదురవుతూనే ఉంది.