బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె అభిమానులతో ఛాట్ చేయగా, పవన్ సాయి విడాకుల మ్యాటర్ ఆమెకి లింక్ చేశారు. దీంతో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది తనూజ.
తనూజ పుట్టస్వామి.. ఇటీవల బిగ్ బాస్ తెలుగు 9 షోతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె రన్నరప్ గా నిలిచింది. కప్‌కి ఒక్క అడుగు దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఆమెనే బిగ్ బాస్ విన్నర్ అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కళ్యాణ్ పడాలని విన్నర్‌ని చేశారు. దీంతో ఆమెతోపాటు అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అమ్మాయిలను విన్నర్‌ని చేయరనే విమర్శలు బిగ్ బాస్ నిర్వాహకులు ఎదుర్కొన్నారు.
25
తెలుగు వారికి దగ్గరైన తనూజ
ఈ క్రమంలో తనూజకి రావాల్సిన పాపులారిటీ, గుర్తింపు వచ్చింది. తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఆమెది కన్నడ అయినా, తెలుగు అమ్మాయిగా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడే ఎక్కువగా సందడి చేస్తోంది. తెలుగు షోస్‌లోనే మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల బీబీ ఉత్సవంలో పాల్గొని అలరించింది. కళ్యాణ్ పడాలతో కలిసి ఆమె సందడి చేసింది, స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. అభిమానులతో ఛాట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్ వైరల్ అవుతుంది.
తనూజ `ముద్దమందారం` సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో నటుడు పవన్ సాయికి జోడీగా నటించింది. ఈ సీరియల్ బాగా పాపులర్ అయ్యింది. అందులోనూ పవన్ సాయి, తనూజ జోడికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ జోడీ వల్ల సీరియల్‌కి మంచి రేటింగ్ వచ్చింది. ఈ సీరియల్‌తో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మధ్య పవన్ సాయి గురించి తనూజ మాట్లాడుతూ, తన ఫ్యామిలీలో ఓ వ్యక్తిలాంటి వారని, తాను ఏదైనా చేయాలంటే ఆయన సలహా తీసుకుంటానని, ఏదైనా సరైన నిర్ణయం చెబుతారని, చాలా కూల్ పర్సన్ అని చెప్పింది. పవన్ సాయితో ఉన్న రిలేషన్‌ని బయటపెట్టింది.
ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్ చేసింది. ఇందులో ఆమెకి విచిత్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్ సాయికి ఆల్‌రెడీ పెళ్లి అయ్యింది. రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో పవన్ సాయి తన భార్యకి విడాకులు ఇవ్వడానికి నువ్వే కారణమని, పవన్ సాయి భార్య కర్మ నిన్ను వదిలిపెట్టదు అని, ఆమె ఉసురు నిన్ను వెంటాడుతుందని విమర్శలు చేస్తున్నారు. దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తనూజ స్పందించి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.
55
నెటిజన్లకి తనూజ దిమ్మతిరిగే కౌంటర్
`నీ కర్మ కూడా నిన్ను వెంటాడకముందే నీపై నువ్వు ఫోకస్ చేసుకోవడం మంచిది, నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను, నా కర్మఫలం బాగుంది కాబట్టి, నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఇలా ముఖం చూపించకుండా ఫేక్ ఐడీలతో ఇలాంటి మెసేజ్‌లు పెట్టడానికి కొంచెమైనా సిగ్గులేదా నీకు ఎవరి ఊసురు వెంటాడకుండా చూసుకో` అని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది తనూజ. తనని విమర్శించే వారిని ఉద్దేశించి ఆమె రియాక్ట్ అవుతూ, డియర్ హేటర్స్ మీరు నా ప్రశాంతతని పాడు చేయలేిరు. నన్ను రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాలు ఫలించవ`ని తెలిపారు తనూజ. దెబ్బకి ట్రోలర్స్ కి నోరు లేవలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె ఛాటింగ్ వైరల్‌గా మారింది.