`తండేల్` మూవీ నాగచైతన్య కెరీర్‌లోనే మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. ఇన్నాళ్లు ఆయన హిట్ కోసం స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు. సరైన బ్రేక్ కోసం స్ట్రగుల్‌అవుతున్నాడు. `మజిలి` తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు.
ఈ క్రమంలో ఇప్పుడు `తండేల్` రూపంలో బ్లాక్ బస్టర్ పడింది. కెరీర్ పరంగా, ఇమేజ్ పరంగా, మార్కెట్ పరంగా ఈ మూవీ చైతూని ఓకేసారి పది మెట్లు ఎక్కించింది. కెరీర్ పరంగా ఆయనకు మరో ఐదారేళ్లు తిరుగులేదని చెప్పొచ్చు.