లేడీ సింగర్ ని క్రిస్ గేల్ తో పోల్చిన తమన్.. రాంచరణ్ మూవీ కోసం ఏం చేసిందంటే

First Published | Oct 23, 2024, 3:15 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. అనేక వాయిదాల తర్వాత చివరికి గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. నెమ్మదిగా ప్రొమోషన్స్ పెంచుతున్నారు.

Game Changer

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. అనేక వాయిదాల తర్వాత చివరికి గేమ్ ఛేంజర్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. నెమ్మదిగా ప్రొమోషన్స్ పెంచుతున్నారు. ఆల్రెడీ గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. జరగండి, రా మచ్చా సాంగ్స్ బాగానే వైరల్ అయ్యాయి కానీ వినసొంపుగా లేవంటూ విమర్శలు వచ్చాయి. 

ఈ తరుణంలో త్వరలో 3వ సాంగ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. ఈ సాంగ్ గురించి ఇప్పటికే చాలా హైప్ వచ్చింది. అంజలి అయితే తన సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ మూడో పాట.. ఒకే ఒక్కడు చిత్రంలో నెల్లూరి నెరజాణ తరహాలో ఉంటుందని హింట్ ఇచ్చారు. 


Singer Shreya Ghoshal

ఇప్పుడు తమన్ ఈ సాంగ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. సాంగ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ ని స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ పాడారు. తెలుగు, హిందీ, తమిళం మూడు భాషల్లో ఈ సాంగ్ ని శ్రేయ ఘోషల్ పాడారట. కేవలం 90 నిమిషాల వ్యవధిలోనే శ్రేయ ఘోషల్ ఈ సాంగ్ రికార్డింగ్ కంప్లీట్ చేసినట్లు తమన్ తెలిపారు. 

శ్రేయ ఘోషల్ ని తమన్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ తో పోల్చారు. 3 భాషల్లో సాంగ్ ని వేగంగా పూర్తి చేసింది. క్రిస్ గేల్ ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా వేగంగా పరుగులు చేస్తారు. కాబట్టి తమన్ శ్రేయ ఘోషల్ ని క్రిస్ గేల్ తో పోల్చారు. 

Latest Videos

click me!