Bhagavanth Kesari Review-Premier Talk
వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ విజయాలు సాధిస్తున్నారు కోలీవుడ్ స్టార్స్ కమల్ హాసన్, రజినీకాంత్. టాలీవుడ్ స్టార్స్ ఈ విషయంలో లేటుగా మేలుకున్నా స్టార్ట్ చేశారు. భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య పాత్ర అలాంటిదే. పెళ్లీడు కొచ్చిన అమ్మాయికి తండ్రి సమానుడైన పాత్ర చేశాడు. భగవంత్ కేసరి కథ రొటీన్. ఇప్పటికే చాలా సినిమాల్లో ట్రై చేసినదే...
Bhagavanth Kesari Review-Premier Talk
అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లకు కష్టం వస్తే... ఎదురుగా ఉన్నది ఎవరైనా తిరగబడే తండ్రి స్టోరీ. భగవంత్ కేసరి తన కూతురు కోసం పెద్దోళ్ళను ఢీకొంటాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. ప్రత్యర్థులపై ఆయన పోరాటం ఎలా సాగింది అనేది కథ...
Bhagavanth Kesari Review-Premier Talk
యూఎస్ లో భగవంత్ కేసరి ప్రీమియర్స్ ముగియగా టాక్ బయటకు వచ్చింది. మెజారిటీ ఆడియన్సు భగవంత్ కేసరి డీసెంట్ ఎమోషనల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఎమోషనల్, కామెడీ సన్నివేశాలతో మొదలవుతుంది. శ్రీలీల-బాలయ్య మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మెప్పిస్తాయి. కామెడీ మాత్రం నిరాశపరిచింది. అంతగా వర్కవుట్ కాలేదు.
Bhagavanth Kesari Review-Premier Talk
అయితే ఇంటర్వెల్ కి ముందు సినిమా ఊపందుకుంది. బాలయ్య మీద వచ్చే మాస్ యాక్షన్ బ్లాక్స్ ఫ్యాన్స్ ని మెప్పిస్తాయి. ఈ మధ్యలో మాత్రం సినిమా రొటీన్ కమర్షియల్ డ్రామాలా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కొంచెం బోరింగ్ గా సాగుతుంది. బాలయ్య మాస్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫస్ట్ హాఫ్ లో అలరించే అంశాలు...
Bhagavanth Kesari Review-Premier Talk
సెకండ్ హాఫ్ బ్యాక్ గ్రౌడ్ ఎపిసోడ్స్ తో మొదలవుతుంది. ఇది కూడా కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సాగుతుంది. బాలికలకు అవసరమైన బాడ్ టచ్ గుడ్ టచ్ పై అవగాహన కల్పించే సన్నివేశాలు కూడా ఈ సినిమాలో జోడించారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన గత చిత్రాలకు భిన్నంగా ఎమోషన్స్, మాస్ ఎలివేషన్స్ మీద ఫోకస్ పెట్టాడు.
Bhagavanth Kesari Review-Premier Talk
అనిల్ రావిపూడి చిత్రాల్లో కామెడీ కోణం ఎక్కువ ఉంటుంది. ఇందులో తగ్గించాడు. బాలయ్యను కొత్తగా ప్రజెంట్ చేశాడనే మాట వినిపిస్తోంది. డైలాగ్స్ మరీ ఓవర్ గా కాకుండా సెటిల్డ్ గా ఉన్నాయని ఆడియన్స్ అభిప్రాయం. థమన్ బీజీఎం ఓకే, సాంగ్స్ నిరాశపరిచాయి. కాజల్ పాత్రకు పెద్దగా స్పేస్ లేదని తెలుస్తుంది. శ్రీలీల కీలకమైన రోల్ లో చాలా వరకు మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Bhagavanth Kesari Review-Premier Talk
మొత్తంగా భగవంత్ కేసరి డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఎమోషనల్, మాస్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి ట్రీట్. రొటీన్ స్టోరీ కావడంతో పాటు అక్కడక్కడా బోరింగ్ గా సాగుతుంది. కామెడీ వర్క్ అవుట్ కాలేదు. అయితే బాలయ్య డైలాగ్, యాక్షన్ ఎపిసోడ్ మెప్పిస్తాయి.. ఈ దసరాకు ఓ సారి ట్రై చేయొచ్చని అంటున్నారు...