Thalapathy Vijay : సీఎం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్, రిలీజ్ కాబోతున్న రెండు సినిమాలు

Published : Jun 11, 2026, 01:07 PM IST

జూన్ 22న దళపతి విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలు థియేటర్లలో మళ్లీ విడుదల కాబోతున్నాయి. ఈ విషయం అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది.

PREV
13
విజయ్ దళపతి అభిమానులకు గుడ్ న్యూస్..

సౌత్ స్టార్ హీరో  విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నటించిన 'జననాయగన్' సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోంది. సెన్సార్ పనుల్లో జాప్యం జరగడమే దీనికి కారణం. దీంతో నిరాశలో ఉన్నఅభిమానులను ఖుషీ చేసేందుకు, విజయ్ పాత హిట్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేయాలని థియేటర్ల ఓనర్లు ప్లాన్ చేశారు.

23
రీ-రిలీజయ్యే సినిమాలు

 జూన్ 19న విజయ్ నటించిన రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయి: ఆర్.టి. నేసన్ దర్శకత్వంలో 2014 పొంగల్ కానుకగా జిల్ల  సినిమా రిలీజైంది. ఇందులో దళపతి విజయ్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూడా నటించారు. కాజల్ అగర్వాల్, సూరి, నివేదా థామస్, తంబి రామయ్య లాంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

33
మెర్సల్

అట్లీ దర్శకత్వంలో 2017 దీపావళికి వచ్చిన ఈ సినిమాలో విజయ్ మూడు పాత్రల్లో అదరగొట్టారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించగా, శ్రీ తేనాండాళ్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇందులో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యా మీనన్ ముగ్గురు హీరోయిన్లు నటించారు. ఈ సినిమా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాలు మళ్లీ రిలీజ్ కావడం అభిమానులకు  డబుల్ ట్రీట్' అని సినీ వర్గాలు అంటున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories