Beast Review: 'బీస్ట్' ప్రీమియర్ షో టాక్.. ఫ్యాన్స్ కి పక్కా కిక్కు, కానీ

Published : Apr 13, 2022, 05:27 AM IST

మాస్టర్ తరహాలోనే మరో భిన్నమైన కథని విజయ్ ట్రై చేశాడు. గతంలో విజయ్ నటించిన తుపాకి నే చిత్రం ఘనవిజయం సాధించింది. అది కూడా టెర్రరిజం నేపథ్యంలో సాగే కథే. మరోసారి విజయ్ బీస్ట్ చిత్రంతో అలాంటి సబ్జెక్టు అటెంప్ట్ చేశాడు.

PREV
17
Beast Review: 'బీస్ట్' ప్రీమియర్ షో టాక్.. ఫ్యాన్స్ కి పక్కా కిక్కు, కానీ
beast

ఇలయ తలపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం నేడు గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ట్రైలర్ యాక్షన్స్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. విజయ్ ఎప్పటిలాగే పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆల్రెడీ ప్రారంభమైన యూఎస్ ప్రీమియర్ షోల నుంచి ప్రేక్షకుల రెస్పాన్స్ వస్తోంది. 

27
beast

మాస్టర్ తరహాలోనే మరో భిన్నమైన కథని విజయ్ ట్రై చేశాడు. గతంలో విజయ్ నటించిన తుపాకి నే చిత్రం ఘనవిజయం సాధించింది. అది కూడా టెర్రరిజం నేపథ్యంలో సాగే కథే. మరోసారి విజయ్ బీస్ట్ చిత్రంతో అలాంటి సబ్జెక్టు అటెంప్ట్ చేశాడు. కాకపోతే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ శైలి పూర్తిగా వేరు. 

37
beast

ఒక షాపింగ్ మాల్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు అక్కడ ప్రజల్ని బందీలుగా మార్చుతారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజల్ని రక్షించడమే ఈ చిత్ర కథ. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. రా ఏజెంట్ గా విజయ్ సింపుల్ గా స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తాడు. విజయ్ ఎంట్రీ సన్నివేశాన్ని ఆయన అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. 

47
beast

ఆ తర్వాత కథ పూర్తిగా ప్రారంభం కాక ముందే బ్లాక్ బస్టర్ సాంగ్ అరబిక్ కుతు వచ్చేస్తుంది. ఈ సాంగ్ విజువల్స్.. విజయ్, పూజా హెగ్డే డ్యాన్స్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ లాగా ఉంటాయి. ముఖ్యంగా పూజా హెగ్డే తన డ్యాన్స్ తో, అందంతో ఆకట్టుకుంటోంది. 

57
beast

నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రంలో హాస్యాన్ని కూడా మిళితం చేశారు. కానీ కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. అనిరుద్ మాత్రం తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే రేసీగా ఉంటుంది. కొన్ని యాక్షన్ బ్లాక్స్ ఆకట్టుకుంటాయి. కానీ కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపిస్తాయి. నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ అభిమానులని దృష్టిలో పెట్టుకునే ఈ కథకు ట్రీట్మెంట్ ఇచ్చాడనిపిస్తోంది. 

67
beast

ఇది ఒక మోడ్రన్ కమర్షియల్ ఫిలిం అనే ఫీలింగ్ తీసుకురావడంలో నెల్సన్ సక్సెస్ అయ్యారు. యాక్షన్ సన్నివేశాల్లో విజయ్ పెర్ఫామెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. ఫస్ట్ అరగంట మాత్రం సినిమా చాలా నెమ్మదిగా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. హైజాక్ సన్నివేశం ప్రారంభం అయ్యాక సినిమా వేరే టర్న్ తీసుకుంటుంది. 

77
beast

కాకపోతే కథలో కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. అద్భుతంగా డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు, విజయ్ పెర్ఫామెన్స్ మీదే ఈ చిత్ర విజయం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అనిరుద్ తన బిజియంతో సినిమాకు బలాన్ని పెంచారు. ఓవరాల్ గా బీస్ట్ మూవీ ఫాన్స్ ని మెప్పించేలా ఉన్నప్పటికీ.. జనరల్ ఆడియన్స్ కి పూర్తి స్థాయిలో నచ్చే సినిమా కాదని అంటున్నారు. 

click me!

Recommended Stories