స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్: వెండితెరపై మెరిసిన టీవీ స్టార్స్..

Published : Aug 30, 2025, 09:42 PM IST

Small Screen to Silver Screen: కొంతమంది టీవీ షోల్లో నటిస్తూ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెండితెరపై అడుగుపెట్టారు. స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన తెలుగు టీవీ స్టార్‌లు . 

PREV
16
బుల్లితెర నుంచి వెండితెరకు

నటనలో రాణించాలనే కల, లక్ష్యం వారి ప్రతి అడుగును సినిమా వైపుకు నెట్టింది. బుల్లితెరపై ధారావాహికలు, టీవీ షోల్లో నటిస్తూ తమ ప్రతిభను నిరూపించారు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెండితెరపై అడుగుపెట్టారు. తమ సినిమాల కోసం కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ, భారీ అభిమాన గణాన్ని సంపాదించారు. టీవీ నుండి సినిమాలో అడుగు పెట్టిన తనకంటూ గుర్తింపు సాధించిన తెలుగు స్టార్‌లు వీరే..

26
ఝాన్సీ

యాంకర్ ఝాన్సీ కేవలం 8 ఏళ్ల వయసులోనే రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించారు. అటు బుల్లితెర, ఇటు వెండితెరపై ఫ్యాన్స్ సొంతం చేసుకున్న ఝాన్సీ, ఆ తర్వాత యాక్టింగ్‌లో ఆసక్తి చూపి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందింది. బుల్లితెరపై 'టాక్ ఆఫ్ ది టౌన్', 'సందడే సందడి', 'బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర', 'స్టార్ మా పరివార్' వంటి కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఫేమ్ తో 'ఎగిరే పావురమా' సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. 'నారప్ప', 'వాల్తేరు వీరయ్య', 'ఎఫ్ 2', 'మల్లేశం', 'తులసి' వంటి సినిమాలతో నటించి మెప్పించింది. ముఖ్యంగా 'తులసి'లో 'కోకాపేట కనకం' పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు పొందింది.

36
అనసూయ భరద్వాజ్:

అనసూయ భరద్వాజ్ ఒకవైపు టాప్ యాంకర్‌గా, మరోవైపు నటిగా సక్సెస్ పుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. జబర్దస్త్ కామెడీ షోలో ద్వారా అనసూన తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఫేమ్ లో యాత్ర, క్షణం, రంగస్థలం, కథనం, పుష్ప వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. రంగస్థలం, పుష్ప, పుష్ప2 సినిమాలో అనసూయ కెరీర్ లో మైల్ స్టోన్స్ అనే చెప్పాలి. పుష్ప సినిమాలో మంగళం శ్రీను భార్య “దాక్షాయ” పాత్రలో అనసూయ తగిన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. చిన్న పాత్ర అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరుగని స్థానం వేసింది. ఈ సినిమా అనసూయ కెరీర్‌లో గేమ్-చేంజర్ గా మారిందనే చెప్పాలి. ఆ తరువాత రవితేజ ఖిలాడీ, చిరంజీవి గాడ్ ఫాదర్ సహా పలు సినిమాల్లో మెరిసింది.

46
ఉదయ భాను:

ఉదయ భాను బుల్లితెరపై తన చలాకీ, అందం, అద్భుత వాడికతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హృదయాంజలి ద్వారా యాంకరింగ్ కెరీర్ ప్రారంభించి, తర్వాత వన్స్ మోర్ ప్లీజ్, రేలా రె రేలా, ఢీ, సాహసం చేయరా డింబకా, నువ్వు నేను వంటి ఎన్నో టెలివిజన్ షోల్లో తన ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ ఫేమ్ తో ఫేమస్, ఎర్ర సైన్యం, లీడర్, జులాయి వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, ప్రత్యేక రోల్స్ ద్వారా వెండితెరపై గుర్తింపు సాధించారు. తాజాగా సత్యరాజ్‌తో ఉదయ భాను కలిసి నటించిన సినిమా ‘త్రిబాణధారి బార్బరిక్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించారు.

56
సుమ కనకాల:

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు దశాబ్దాలుగా టాప్ యాంకర్‌గా కొనసాగుతుంది. యాంకరింగ్ రంగంలో “మకుటం లేని మహారాణి”గా నిలిచారు. సినిమా స్టార్స్ కంటే కంటే ఎక్కువగా ఇమేజ్ తెచ్చుకుంది సుమ. వయసు 50కి చేరువ అవుతున్నా కూడా ఇప్పటికీ అదే స్టార్ డమ్ కంటిన్యూ చేస్తుంది. యాంకర్ సుమ ‘స్టార్ మహిళ’ షోతో ప్రేక్షకుల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందారు.

బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా మెరించింది. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమాలో ప్రభాస్ అక్కగా నటించారు. ఇటీవల జయమ్మ పంచాయతీ లీడ్ రోల్ లో కనిపించారు. కానీ, అనుకున్నంత సక్సెస్ కాలేదు. సుమ కేవలం యాంకరింగ్ ద్వారానే కాదు ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు, ఫుడ్ ప్రొడక్ట్ ప్రమోషన్స్, క్యాష్ గేమ్ షోస్ వంటి కార్యక్రమాల ద్వారా కోట్లలో ఆర్జిస్తున్నారు. ఆమెకు దేశీయంగానే కాదు అంతర్జాతీయంగా కూడా అభిమానులుఉన్నారు.

66
ప్రదీప్ మాచిరాజు:

స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలుగు ఆడియెన్స్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన టైమింగ్ పంచ్, జోకులతో పలు టీవీ షోలను విజయవంతంగా రన్ చేశారాయన. ఇంకా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమాలో హీరోగా అడుగు పెట్టారు. ఈ సినిమా పాటల పరంగా హిట్ టాక్ సొంతం చేసుకున్నా.. సినిమా సక్సెస్ కాలేకపోయింది. ప్రదీప్ కేవలం యాంకర్ మాత్రమే కాదు పలు టీవీ షోలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు.

Read more Photos on
click me!

Recommended Stories