Mahavatar Narsimha Movie Review: `మహావతార్‌ నరసింహ` మూవీ రివ్యూ, రేటింగ్‌.. పిల్లలకు నచ్చుతుందా?

Published : Jul 25, 2025, 04:23 PM IST

యానిమేషన్‌ సినిమాలు మన వద్ద చాలా తక్కువ. తాజాగా హోంబలే ఫిల్మ్స్ వాళ్లు విష్ణువు అవతారాలను ఆధారంగా చేసుకుని `మహావతార్‌ నరసింహం` పేరుతో యానిమేషన్‌ మూవీని రూపొందించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
15
`మహావతార్‌ నరసింహ` యానిమేషన్‌ మూవీ రివ్యూ

హోంబలే ఫిల్మ్స్ `కేజీఎఫ్‌` చిత్రంతో ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయిన బ్యానర్‌. `కాంతార`, `సలార్‌` చిత్రాలతో మరింతగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యానర్‌ నుంచి ఇప్పుడు యానిమేషన్‌ చిత్రాలు కూడా వస్తున్నాయి. మైథాలజీ స్టోరీస్‌ని తీసుకుని సినిమాలు రూపొందిస్తున్నారు.

అందులో భాగంగా విష్ణువు అవతారాలను కథలుగా `మహావతార్` పేరుతో యానిమేషన్‌ మూవీస్‌ని రూపొందించారు. వీటిలో మొదటి భాగంగా `మహావతార్‌ నరసింహ` చిత్రాన్ని తెరకెక్కించారు. 

అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వంలో క్లీం ప్రొడక్షన్స్ పతాకంపై శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌ నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(జులై 25)న విడుదలైంది. ఈ యానిమేషన్‌ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

25
`మహావతార్‌ నరసింహ` కథేంటంటే?

రాక్షసరాజు హిరణ్యకశిపుడి చరిత్రని చెప్పే కథ ఇది. దితి రాక్షస కుమారులైన హిరణ్యకశిప, హిరణ్యాక్షుడుకి జన్మనిస్తుంది. వీరిద్దరు ఈ లోకంలోనే అత్యంత క్రూరమైన రాక్షసులు. అనేక యజ్ఞాలు చేసి శక్తిని సంపాదిస్తారు. అత్యంత బలవంతులుగా మారతారు. 

దేవతలను ఇబ్బంది పెడుతుంటారు. ముఖ్యంగా హిరణ్యాక్షుడు అత్యంత హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటాడు. దీంతో దేవతలు వేడుకోగా మహావిష్ణువు హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. దీంతో రగిలిపోయిన హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి మరణంలేని కోరిక కోరతాడు.

 ఈ లోకాలకు తానే రాజు కావాలని, తనకంటే బలవంతులు ఉండకూడదని, తనకు ఏ రూపంలోనూ మరణం సంబంధించకూడదని వరం కోరతాడు. ఇలాంటి వరం ఇప్పటి వరకు ఎవరూ కోరలేదని చెప్పిన బ్రహ్మదేవుడు ఆ వరం ఇస్తాడు. దీంతో దేవతలను అందరిని తనకు బానిసలుగా మార్చుకుంటారు. 

విష్ణు భక్తులను సంహరించడం,  హింసకు గురి చేస్తుంటారు. ఈ క్రమంలో హిరణ్యకశిపుడికి కొడుకు ప్రహ్లాదుడు జన్మిస్తారు. ఆయన మహా విష్ణువు భక్తుడు. ఆ భక్తిని చూసి తట్టుకోలేక ప్రహ్లాదుడు తమ అసుర(రాక్షసుల) జాతికి ముప్పు తెచ్చే అవకాశం ఉందని, రాక్షస జాతి అంతరించేందుకు కారణమవుతాడని చెప్పి కొడుకునే చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. 

మరి కొడుకుని చంపేందుకు హిరణ్యకశిపుడు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ప్రహ్లాదుడు ఎలా తప్పించుకున్నారు? విష్ణువు ఎలా సహాయం చేశారు? చివరికి హిరణ్యకశిపుడి అంతం ఎలా జరిగింది? విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి ఎలా అంతం చేశాడనేది ఈ చిత్ర కథ.

35
`మహావతార్‌ నరసింహ` విశ్లేషణ

`మహావతార్‌ నరసింహ` మూవీ పూర్తిగా యానిమేషన్‌ ప్రధానంగా రూపొందించిన మూవీ. పూర్తి వీఎఫ్‌ఎక్స్ తో చేసిన సినిమాగా చెప్పొచ్చు. సహజత్వం ఉండదు. కార్టూన్‌ సినిమాలను తలపిస్తుంది. అయితే ఈ మూవీ క్వాలిటీ చాలా బెటర్‌గా ఉంది.

 సినిమా చూసే క్రమంలో మనం కథలో ఇన్‌ వాల్వ్ అయ్యే క్రమంలో అందులో ఉన్నది యానిమేషన్‌ పాత్రలు కావు, నిజమైనవే అనేంతగా ఆకట్టుకునేలా ఉంటాయి. అంతగా ఆడియెన్స్ ని ఇన్‌వాల్వ్ చేయించడంలో మేకర్స్ సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. 

కాకపోతే కథ పరంగా చాలా షార్ట్ గా చూపించారు. రెండున్నర గంటల మూవీ కావడంతో కథని సింపుల్‌గా మార్చేశారు. కవల రాక్షసులు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు క్రూరమైన రాక్షసులుగా తయారు కావడం, వారు అనేక అరాచకాలకు పాల్పడటం, దేవతలను బయపెట్టడంతో వరాహ రూపంలో విష్ణువు వచ్చి హిరణాక్ష్యుడిని చంపేయడం, 

దీంతో ఆ ప్రతీకారం తీర్చుకునేందుకు బ్రహ్మ కోసం హిరణ్యకశిపుడు తపస్సు చేయడం, ఆయన తపస్సు మన్నించి కోరిన వరం ఇవ్వడం, దీంతో అన్ని లోకాల ప్రజలను, దేవతలను తన వశం చేసుకోవడం, విష్ణువు భక్తుడైన కొడుకు ప్రహ్లాదుడిని చంపేందుకు ప్రయత్నించడం,  ఆ తర్వాత ఏకంగా విష్ణువే నరసింహ అవతారంలో వచ్చి అతన్ని అంతం చేయడమే ఈ మూవీ. 

ఇలా సింపుల్‌గా కథని చెప్పారు. ఎక్కడా కథని దాటి బయటకు వెళ్లలేదు. సినిమా మొదటి భాగం మామూలుగానే సాగుతుంది. యాక్షన్‌ సీన్లకి ప్రయారిటీ ఇచ్చారు. కానీ ప్రహ్లాదుడి పాత్ర ఎంట్రీ తర్వాత ఎమోషనల్‌గా ఉంటుంది. రాక్షసరాజుకి విష్ణు భక్తుడు జన్మించడం, కొడుకునే చంపేయాలనుకోవడం కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 

సెకండాఫ్‌ తర్వాత ఎమోషనల్‌ కనెక్షన్‌ స్టార్ట్ అవుతుంది. ప్రహ్లాదుడి సీన్లు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో ప్రహ్లాదుడికి విష్ణువు దర్శనం, ఆ తర్వాత హిరణ్యకశిపుడిని చంపేందుకు నరసింహ అవతారంలో రావడం, ఆయన విజృంభించే సీన్లు బాగున్నాయి. క్లైమాక్స్ పార్ట్ మాత్రం అదిరిపోయింది.

45
`మహావతార్‌ నరసింహ`లో మైనస్‌లు

కాకపోతే సినిమా తీసిన ఉద్దేశ్యం ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కథతో ఒకప్పుడు మన తెలుగులో(భక్తప్రహ్లాద) కూడా సినిమాలు వచ్చాయి. ఆకట్టుకున్నాయి. ఇప్పటి జనరేషన్‌కి కథ చెప్పడం కోసం అయితే బాగానే ఉంది. కానీ యానిమేషన్‌ మూవీని చూస్తారా? అనేది సస్పెన్స్. బేసిక్‌గా ఇలాంటి చిత్రాలను చిన్న పిల్లల కోసం చేస్తుంటారు. 

అయితే వారిని ఆకట్టుకోవాలంటే మంచి యాక్షన్‌ సీన్లు, ఫన్‌ ఎలిమెంట్లు ఉండాలి. ఎమోషన్స్ బలంగా ఉండాలి. ఇందులో యాక్షన్‌ సీన్లు బాగున్నాయి, కానీ ఫన్‌, బలమైన ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. సినిమా మొత్తం సీరియస్‌గా సాగుతుంది. ప్రహ్లాదుడి ఎపిసోడ్‌లో ఇతర పిల్లలతో మంచి ఫన్నీ సీన్లు పెట్టాల్సింది. వాహ్‌ మూమెంట్స్ లేవు, సినిమా మొత్తం ఫ్లాట్‌గా సాగుతున్నట్టు ఉంటుంది.

ప్రహ్లాదుడిని చంపేందుకు చేసే ప్రయత్నాలే ఎక్కువగా చూపించారు. కాస్త లిబర్టీ తీసుకునే ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంగిల్‌ జోడిస్తే పిల్లలకు బాగా కనెక్ట్ అయ్యేది. ఇవి లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. కథ మొత్తం హిరణ్యకశిపుడి కోణంలో సాగుతుంది. నరసింహ పార్ట్ క్లైమాక్స్ లో మాత్రమే వస్తుంది,.

ఈ లెక్కన ఇది నరసింహ కథ చెప్పినట్టు లేదు, హిరణ్యకశిపుడి కథ చెప్పినట్టు, ప్రహ్లాద కథ చెప్పినట్టుగానే ఉంది. ఇక విజువల్స్ పరంగా వండర్‌గా ఉంది. మన ఇండియాలో ఈ రేంజ్‌ క్వాలిటీతో యానిమేషన్‌ మూవీస్‌ రాలేదని చెప్పొచ్చు. ఆ విషయంలో  మేకర్స్ ప్రయత్నం అభినందనీయం. ఈ సినిమా వస్తుందనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ప్రమోషన్స్ లేవు. ఇదే పెద్ద మైనస్‌.

55
`మహావతార్‌ నరసింహ` టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

సినిమా పాత్రలను మలిచిన తీరు, హవభావాలు బాగానే ఉన్నాయి. ఇంకా డెప్త్ గా చేయాల్సింది. ఇక మ్యూజిక్‌ బాగానే ఉంది. బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ సినిమాకి హైలైట్‌. డైలాగ్స్ లో కొంత రియాలిటీ తగ్గింది. దర్శకుడు కథ చెప్పాలనుకున్నాడు కానీ, ఎలా చెప్పాలనే విషయంలో ఇంకా వర్క్ చేయాల్సింది.

తెలిసిన కథనే సింపుల్‌గా చెప్పాడు. పైగా పైపై కథనే చెప్పారు. తెలియని విషయాలను ఏదైనా టచ్‌ చేయల్సింది. పిల్లల యాంగిల్‌లో కొంత ఫ్రీడమ్‌ తీసుకుని చేస్తే బాగుండేది. ఓవరాల్‌గా చూస్తే మెప్పించే మూవీ అవుతుంది. పిల్లలతో సరదాగా, టైమ్‌ పాస్‌కి చూడగలిగే మూవీ.

రేటింగ్‌ః 2.75

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories